- ఏకగ్రీవాలపై మండిపడుతున్న ప్రతిపక్షాలు
- గవర్నర్ ను కలిసిన బీజేపీ, జనసేన నేతలు
- ప్రకటనను తప్పుబట్టిన నిమ్మగడ్డ
ఏపీలో కొత్త పంచాయితీ మొదలైంది. ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలపై ప్రకటన ఇవ్వడం వివాదాలకు మూలకారణంగా నిలుస్తోంది. ప్రభుత్వం ఏకగ్రీవాలపై దృష్టి పెట్టడంతో ఆన్ లైన్ లో నామినేషన్ల ప్రక్రియ చేపట్టాలని ప్రతిపక్షాలైన టీడీపీ, బీజేపీ, జనసేన డిమాండ్ ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అపుడే బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోవచ్చిన ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి.
బెదిరింపులతో ఏకగ్రీవాలా?
ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రభుత్వం ఏకగ్రీవాలకు తెరలేపిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపిస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందని పంచాయతీలను ఏకగ్రీవం చేయాలని చంద్రబాబు ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికలపై పల్లెప్రగతి పంచసూత్రాల పేరుతో చంద్రబాబు మేనిఫెస్టోను విడుదల చేశారు. పంచాయతీల పరిరక్షణకు టీడీపీ కట్టుబడి ఉందని తెలిపారు. టీడీపీకి ఓటేస్తే గ్రామాల్లో ప్రార్థనాలయాలను కాపాడతామని హామీ ఇచ్చారు. భూకబ్జాలను అడ్డుకుంటామని పారిశుద్ధ్యం మెరుగు పరుస్తామని అన్నారు. అభ్యర్థులపై మంత్రులు, ఎమ్మెల్యేలు బెదిరింపులకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. పంచాయతీలపై ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలని ఎస్ఈసీని కోరారు.
ఇదీ చదవండి: సర్కార్ జీవోతో నిమ్మగడ్డ అప్రమత్తం
గవర్నర్ ను కలిసిన బీజేపీ, జనసేన నేతలు:
మరోవైపు ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీజేపీ నేతలు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, జనసేన తరపున నాదెండ్ల మనోహర్ లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేలా చూడాలని ఆన్ లైన్ ద్వారా నామినేషన్ వేసే అవకాశాన్ని కల్పించాలని గవర్నర్ ను కోరారు.
ఇదీ చదవండి: గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసిన ఎస్ఈసీ
ఏకగ్రీవ పంచాయతీలపై నిమ్మగడ్డ ఫైర్:
మరోవైపు ఏకగ్రీవ పంచాయతీలపై ప్రభుత్వం ప్రకటనలు జారీ చేయడాన్ని ఎన్నికల సంఘం తప్పుబట్టింది. ఎన్నికల సంఘం అనుమతిలేకుండా ప్రకటనలు ఎలా ఇస్తారంటూ ఐ అండ్ పీఆర్ కమిషనర్ కు నోటీసులు జారీ చేశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.
ఇదీ చదవండి: జగన్, చంద్రబాబు మధ్య నలుగుతున్న ఆంధ్ర ప్రజానీకం