- దీప్ సిద్దూ ఎక్కడ ఉన్నాడు.
- గోడలు దేశ సరిహద్దుల్లో కట్టాలని వ్యంగాస్త్రాలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలపై రెండు నెలలకు పైగా ఆందోళన సాగిస్తున్న రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తోందని రాజ్యసభలో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ రోజు ఉదయం (పిబ్రవరి 5) రాజ్యసభ ప్రారంభం కాగానే విపక్షాలకు చెందిన ఎంపీలు సాగు చట్టాల అంశాన్ని ప్రస్తావించారు. ఆందోళన చేస్తున్న రైతుల సమస్యలను గాలికొదిలేసి రోడ్లపై మేకులు, బారికేడ్లు మోహరించి రైతులను హింసిస్తోందని విపక్షాలు విమర్శించాయి.
Also Read: రైతుల దిగ్బంధంపై పలువురి సంఘీభావం
ప్రభుత్వంపై ప్రశ్నలవర్షం కురిపించిన విపక్షాలు:
గణతంత్ర దినోత్సవంనాడు జాతీయజెండాకు జరిగిన అవమానానికి దేశ ప్రజలంతా విచారం వ్యక్తం చేశారని అయితే దీనికి కారకులను మాత్రం ప్రభుత్వం ఇప్పటివరకు పట్టుకోలేకపోయిందని విపక్షాలు దుయ్యబట్టాయి. దీప్ సిద్దూ ఎక్కడున్నాడు. ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేకపోయిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నల వర్షం కురిపించారు. రైతుల ఆందోళనపై అంతర్జాతీయంగా మద్దతు లభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం వారిపై దుష్ప్రచారం చేసి అరెస్టు చేస్తోందని విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని దుయ్యబట్టాయి. రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా రోడ్లపై మేకులు, కాంక్రీటు గోడలు నిర్మించడంపై బీఎస్పీ ఎంపీ సతీష్ చంద్ర మిశ్రా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇవన్నీ చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో చేయాల్సిన పనులను గుర్తు చేశారు. ఆందోళన చేస్తున్న రైతులకు నీటి సరఫరా, విద్యుత్ సరఫరాను నిలిపివేయడం అమానుషమైన చర్యగా బీఎస్పీ ఎంపీ అభివర్ణించారు. రైతుల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని మిశ్రా మండిపడ్డారు.
Also Read: రైతుల ఉపవాస దీక్ష…కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం