- 35 మంది ఆకతాయిల అరెస్ట్
- స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న శ్రీరాంపూర్ పోలీసులు
అర్ధరాత్రి రోడ్లపై జులాయి గా తిరుగుతూ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని ‘ఆపరేషన్ చబుత్రా’ పేరుతో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధి లో తనిఖీలు చేపట్టారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధి లో అర్ధరాత్రి పోలీసులు ఆపరేషన్ చబుత్రా ను నిర్వహించారు. యవకులు అర్ధరాత్రి వేళల్లో ప్రధాన కూడళ్లు, వీధులు, రోడ్లు, ఫుట్‌పాత్‌లపై గుంపులుగా జులాయిగా తిరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మద్యం సేవించి ద్విచక్ర వాహనాలతో రాష్ డ్రైవింగ్, హారన్లు కొడుతూ అనుమానస్పదంగా తిరుగుతున్న 35 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నరు. వారి వద్ద ఉన్న ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని, ముఖ్యంగా యువకులు మద్యం సేవించి ఆవేశంలో అనర్ధాలు కొని తెచ్చుకుంటున్నారని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా చెడు వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఉందని, తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండి గమనించాలన్నారు. పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఎవరైనా యువకులు రోడ్లపై విన్యాసాలు చేస్తూ కనబడితే వారిని అరెస్ట్ చేసి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. స్పెషల్ డ్రైవ్ లో సీఐ శ్రీరాంపూర్ బిల్లా కోటేశ్వర్, ఎస్ఐ మంగీలాల్, జైపూర్ ఎస్ఐ రామకృష్ణ, శ్రీరాంపూర్, జైపూర్ పోలీస్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: మానవ అక్రమ రవాణా నివారణకు కృషి : డీసీపీ పెద్దపల్లి పి. రవీందర్