Tuesday, January 7, 2025

యుక్తాయుక్త విచక్షణ పరమావధి

భగవద్గీత99

Summer Fires – Winter Fans. ఇది ఎలా వినబడుతున్నది? అయుక్తమైనది కదా! మరి ఏది యుక్తము? ఏది సరి అయినది?

Summer లో విసనకర్రలు చేతబట్టుకుంటాము, లేదా Fans  వేసుకుంటాము. Winter లో చలిమంట వేసుకుంటాము. అంటే ఏది ఎప్పుడు యుక్తమో ఎంతవరకు అవసరమో ఆ పని చేయాలి.

Also read: అభ్యాసవైరాగ్యాలు

విందు భోజనానికి వెళ్ళాము. వందరకాల పదార్ధాలు నోరు ఊరిస్తూ ఉంటాయి.  అందుబాటులో ఉన్నవి కదా అన్నింటిని పొట్టలోవేసేస్తే తెల్లవారి వందమాత్రలు మింగాలి. ఆహారం విషయంలో కాలానికి అనుగుణంగా, ఋతువుకు తగ్గట్లుగా ఆయా పదార్ధాలు తీసుకోవాలి. అది ‘‘యుక్తము’’ అనగా సరిఅయినది.

ఇక బాగా చలికాలంలో మంచు కొండలకు విహారానికి, మంచి ఎండాకాలంలో ఎడారులు చూడటానికి వెళతామా? అది యుక్తమా? కాదు కదా!

అలాగే వేసవికాలంలో టైటు జీనుప్యాంట్లు లేదా సూటుబూటు. చలికాలంలో వదులు కాటన్‌ దుస్తులు వేసుకుంటే? అది యుక్తమా? అది సరి అయినదా?

అదేవిధంగా మనపై అధికారి దగ్గరకెళ్ళి అతను మనతో సమానమైన వయసువాడే కావచ్చు లేదా మనకంటే చిన్నవాడు కావచ్చు `ఆ! ఏమోయ్‌ బాగున్నావా? ఏంటి సంగతులు` అని భుజం మీద చేయివేసి మాట్లాడితే అది యుక్తమా? అది సరి అయినదా?

Also read: అభ్యాసంద్వారా అంతరాల దర్శనం

మన శక్తి ఏమిటో, మన శరీరము సహకరిస్తుందో లేదో తెలియకుండా బరువు పనులు చేసుకుంటూ పోవడం సరిఅయినదా?

ఆఫీసులో ఏ పని ఎప్పుడు చేయాలో,  ఏది ముందు, ఏది వెనుక, దేనితరువాత ఏ పనిచేయాలో తెలియకుండా అడ్డదిడ్డంగా పని చేసుకుంటూ పోవడం సరిఅయినదా? అది యుక్తమా? ఏది priority, ఏది non priority తెలియనక్కరలేదా?

రాత్రంతా మేలుకొని టివీలు చూస్తూ, సోషల్‌ మీడియాలో సోషవచ్చేదాకా కబుర్లుచెపుతూ, తెల్లవారి ఆఫీసులో నిద్రపోవడం సరి అయినదేనా. సరైన నిద్ర, సరైన సమయంలో మెలకువపాటించి చేయవలసిన పనులు చేయగలమా?

ఏ ఆహారం ఎంత తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి. ఏ ప్రాంతానికి ఎప్పుడు వెళ్ళాలి. ఎవరింటికి ఏ సమయంలో వెళ్ళాలి. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి. ఏ పని ఎప్పుడు చేయాలి, ఎంత చేయాలి. మన బలమేమిటి, బలహీనతేమి. మన అవకాశాలెన్ని. ఏది సరైన సమయం అంటూ SWOT analysis చేయానక్కరలేదా.

ఏ సమయంలో నిద్రపోవాలి, ఎంతసేపు నిద్రపోవాలి. మెలకువగా ఉండి పనులు చక్కపెట్టుకొనేది ఎట్లా?

పై విషయాలన్నింటిపట్ల అవగాహనతో ఉండి, ఏది ఎంత మోతాదులో చేయాలనే స్పృహ ఉన్నవాడికి దుఃఖము ఎందుకు కలుగుతుంది. ఇది తెలుసుకొని పనులు చక్కపెట్టడమే సరి అయిన Management.

యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు

యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా

ఇదే కదా పరమాత్మ చెప్పినది.

Also read: భోగలాలసత దుఃఖకారకం

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles