భగవద్గీత – 44
మాకు 1 BHK వద్దు 3 BHK కావాలి.
`B` అంటె Bed Room
`H` అంటే Hall
`K` అంటే Kitchen
సదా పడుకోవడానికి, Idiot Box (అదే TV) పెట్టుకొని 24 గంటలూ చూడటానికి, ఇక తినడానికీ – ఈ మూడింటికే ప్రాధాన్యం.
Also read: సత్వ గుణం గలవాడు యోగ్యుడు
ఇళ్ళు కట్టి అమ్మే వారి ప్రకటనలూ ఇవి. 1 BHK, 2 BHK, 3 BHK ఇవీ మనం ఇళ్ళ గురించి మాట్లాడుకునే మాటలు. అంటే మన ఇంట్లో ఎన్ని బెడ్ రూములు ఉన్నాయి, ఎంతబాగా నిద్రపోగలము అనే కదా దానర్ధం? ఏ ఒక్కరం కూడా మన ఇంట్లో ధ్యానం చేసే గది ఉన్నదా?
చదువుకునే వాతావరణంతో జ్ఞాన సముపార్జన కోసం ఒక గది ఉన్నదా? అని ఆలోచించామా? అసలు అలా ఉన్నదని చెపుతామా? ఉహూ! ఉండదు.
అన్నిగదులూ వాల్చిన పడకలతో నిద్రపోవడానికి వీలుగా పట్టు పరుపులతో A.C. కూడ ఉండి సదా నిద్రపోవడానికి సిద్ధంగా ఉంటాయి. నిద్రకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం.
Also read: శ్రీవారి పాదకమల సేవాభాగ్యమే పరమావధి
అంతేనా ఎవరి స్థోమత ను బట్టి వాళ్ళు ఇళ్లకు గ్రానైటు తాపడాలో, పింగాణీ టైల్స్ తొ తాపడాలో చేయిస్తున్నాము. మట్టి, కంకర, ఇనుముతో ఉన్నవాటిమీదే ఇంత ’’మోహం’’ పెంచుకుంటున్నాము. అంటే మనలోని ‘‘తమో’’ గుణాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచు కుంటున్నాము.
అంతేనా? మా ఇల్లు ఈశాన్యం తిప్పికట్టాం. ఇదిగోండి ఈశాన్యం కూడా బాగా పెరిగింది, మా ఇంటికి ఈశాన్యం వీధిపోటుకూడా ఉంది అని వచ్చిన ప్రతివాడికీ చూపిస్తాము.
ఎందుకు? అని విచారిస్తే …
కష్టపడకుండా ధనప్రవాహం ఇంట్లోకి వచ్చి చేరాలి. ఇది అలసత్వానికి పరాకాష్ఠ. తమోగుణ విజృంభణ. ఇక బయట వ్యవహారాలలోకి వస్తే ప్రక్క వాడి జేబులో డబ్బు మన జేబులోకి ఎలా రావాలి? మన జేబులు ఎలా నిండాలి? అందుకు ప్రజలను ఎలా మోహంలో నెట్టివేయాలి? అందుకు తగిన ప్రణాలికలేమిటి?
Business Strategies!
All these Business strategies, advertisements are pushing humans into “MOHA” which is the characteristic feature of THAMO GUNA.
This very act of pushing humans into MOHA is Rajo Guna. ఈ విధంగా మనుషులను తోసే గుణం, ఆక్రమించే స్వభావం… రజోగుణం. ప్రస్తుత సమాజం ఈ రెండు గుణాల, స్వభావాల వీర విజృంభణ చూస్తున్నది.
మనిషి సత్వగుణం కోసం ప్రయత్నం చేయటంలేదు (Majority) మరి పరమాత్మ ఏమంటున్నారు? ఆయన ఈ మూడు గుణాలకు అతీతంగా ఎదగమంటున్నాడు. “Think Beyond”
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగురుతుందా? ఎగరాలి. ఎగరటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే పరమాత్ముడు, పరంధాముడు ఎరుకలోకి వస్తాడు. లేకపోతే మనకు ఈ కొత్తదేవుళ్ళు Semi Gods, Demi Gods, News Gods మాత్రమే శరణ్యం!
గుణానేతానతీత్య త్రీన్ దేహీ దేహ సముద్భవాన్
జన్మమృత్యు జరాదుఃఖైః విముక్తో అమృతమశ్నుతే
శరీర ఉత్పత్తికి కారణమైన ఈ మూడు గుణాలకు అతీతంగా ఎదిగిన మనిషికి చావు, పుట్టుక, ముసలితనము, ఇలాంటి దుఃఖాల నుండి విముక్తుడై అమృతత్వాన్ని పొంది పరమానంద భరితుడవుతాడు. ఇంతకంటే జీవిత పరమార్ధం ఏమిటి?
Also read: నేటి ఆలోచన రేపటి భవిష్యత్తు