- బాబుపై లిక్కర్ స్కామ్ కేసు బుక్ చేసిన సి ఐ డి
- పురందేశ్వరి ఆరోపణల పై బుక్ ఐన కేస్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కేసులో చిక్కు కున్నారు. లిక్కర్ కంపెనీలకు 2015 నుంచి 2019 మధ్య కాలంలో జారీ చేసిన లైసెన్సులలో అవకతవకలు జరిగినట్లు సి ఐ డి కేసు నమోదు చేసింది. ఈ కేసుకి సంబందించి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు గత రెండు నెలలుగా లిక్కర్ లైసెన్సులపై అవినీతి జరిగిందని ఆరోపిస్తూ వస్తున్నారు. ఆసక్తికరంగా ఈరోజు సి ఐ డి కేసు నమోదు చేసింది.
చంద్రబాబు హయాంలో జారీ చేసిన మద్యం కంపెనీల నుంచే తాము మద్యం కొంటున్నామని వైస్సార్ ప్రభుత్వం కొత్తగా లైసెన్స్ జారీ చేసింది లేదని చెబుతూ వస్తోంది.
ఈరోజు సి ఐ డి ఏసీబీ కోర్టు లో తదుపరి విచారణ నిమిత్తం అనుమతి కోరుతూ పిటిషన్ వేసింది. కోర్టు సి ఐ డి కి తదుపరి విచారణ కు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిషి సిసోడియా మద్యం కేసులో గత ఎనిమిది నెలలుగా జైలు ఉన్న విషయం విదితమే.