రాజేందర్ జింబో
చాలా రోజుల నుంచి
నాకో సందేహం
మొదలైంది
దేవుడున్నాడా అని
అర్హులు కిందికి
అనర్హులు పైకీ
వెళ్తుంటే
మిఠాయి
మీద ఆశతో
తెలిసి తప్పులు చేస్తుంటే
పప్పు బెల్లాలు
ఆశ పెట్టి తప్పులు చేయిస్తుంటే
సందేహం సహజమే!
నిర్ణయం ఒకరిది
చెప్పేవాడు
మరొకడు
అంతా అయోమయం
అగమ్యగోచరం
ఫర్లోగ్ లో వున్న రేపిస్ట్ బాబా కి
జడ్ క్యాటగిరి
ఓటు వెయ్యడానికి
డబ్బుల డిమాండ్
ఇలా ఎన్నో
దృష్టాంతాలు
అందుకే
దేవుడున్నాడా..?
దేవుడున్నాడా..?
నిరంతరం వేధిస్తున్న ప్రశ్న
వంద కాదు వేయి తప్పులు
దాటిన తరువాత
కూడా దుష్ట శిక్షణ
జరగకపోతే
దేవుడున్నాడా నన్నది
జవాబు దొరకని
సందేహం
బయట ఎవడో
అరుస్తున్నాడు
న్యాయం గెలిచిందని
అవును
న్యాయం గెలిచింది
దేవుడు వాళ్ళ వైపు
వున్నాడేమో
Also read: హిజాబ్
Also read: కొన్ని రాతలు
Also read: కనబడుట లేదు
Also read: నొప్పి మందు
Also read: ఒకప్పుడు …