(‘THE CURSE’ FROM ‘ THE WANDERER’ BY KAHLIL GIBRAN)
తెలుగు అనువాదం:డా సి. బి. చంద్ర మోహన్
33. సంచారి తత్త్వాలు
————–
సముద్రం దగ్గర నివసించే ఒక వృధ్ధుడు ఒక సారి నాతో ఇలా అన్నాడు. ” ఇప్పటికి ముఫ్పయి ఏళ్ల క్రితం ఒక నావికుడు నా కూతురుతో పారిపోయాడు. నేను వారిద్దరినీ నా మనసులో శపించాను. ప్రపంచం మొత్తం లోనే నా కూతురుని ఎక్కువగా ప్రేమించాను.”
“దానికి కొద్ది రోజుల తరువాత ఆ యువ నావికుడు, తన ఓడతో సహా సముద్ర గర్భంలో కలిసిపోయాడు. అతనితో పాటు నా ప్రియమైన కూతురు కూడా నాక్కాకుండా పోయింది.”
” ఇప్పుడు నాలో యువతీ యువకులను చంపిన ఒక హంతకుడిని చూస్తున్నావు. నా శాపమే వారిని నాశనం చేసింది. కాటికి కాళ్ళు చాపుకున్న ఈ సమయంలో నేను దైవాన్ని క్షమించమని కోరుకుంటున్నాను. ”
ఇదీ ఆ ముసలాయన చెప్పింది. కానీ నాకతని మాటల్లో ఒక బడాయి కనిపించింది. అతడు, తన శాపానికి ఉన్న శక్తి గురించి, ఇంకా గర్వ పడుతున్నట్లు అనిపించాడు.
Also read: ఆనందము — దుఃఖము
Also read: హింస నచణ —- ( ఒక) ధ్వంస రచన
Also read: కీచకుడు లేని “విరాట పర్వం”
Also read: ఎలుకా, పిల్లీ
Also read: రూత్ దొరసాని