వృద్ధాప్యం ప్రభావం చాలా వరకు మన దృష్టికోణం (attitude) పై ఆధారపడి ఉంటుంది. కొంత పరిసరాలను బట్టి. పల్లెల్లో ఉండి కాయకష్టం చేసినవాళ్ళు 45 ఏళ్ళకే ముసలివాళ్లుగా భావిస్తారు, కనుపిస్తారు. పట్నవాసాల్లో 80 ఏళ్లవాళ్ళు జీన్స్ వేస్తారు. ఆరోగ్యం బాగుంటే వయసు గురించి ఆలోచన రాదు. అదివరకు తన చెప్పుచేతల్లో ఉన్న భార్య, పిల్లలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం తనను కించ పరచడంగా భావించి ఆత్మ న్యూనత పొటమరిస్తుంది. ఆస్తి తన చేయి దాటితే కొంత అభద్రత. కోరికలు వయసుకు తగ్గట్లు లేకపోతే అదో సమస్య. కాలంతో పాటు మారక పోవడం వల్ల పిల్లలతో, మనవళ్లతో సమాధాన పడలేకపొవడం (adjust కాలేకపోవడం). పుస్తకాలు చదివే అలవాటు లేకపోవడం, స్నేహితులు లేకపోవడంతో కాలం గడపడం కష్టంగా మారడంలాంటివి దృష్టిలో ఉంచుకోవడం మంచిది.
Also read: “అక్షర ధాం, ఢిల్లీ – అపరూప కళా ఖండం”
Also read: “కాశ్మీర్”
Also read: “మహాభారతంలో శకుని”
Also read: తెలుగు మీడియం
Also read: మనువు చెప్పిన చతుర్వర్ణాల పుట్టుక వెనుక ప్రతీకలు (symbols).