- సామాన్యుల జేబుకు చిల్లు
- విదేశీ మార్కెట్లలో పెరుతున్న చమురు ధరలు
రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు భయపడుతున్నారు. ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలో లీటరుకు 25 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో ఇంధన ధరలు ఎన్నడూ లేనంత గరిష్టస్థాయిలకు చేరాయి. తాజాగా పెరిగిన ధరలతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.84.95 పైసలుగా ఉంది. డీజిల్ ధర రూ.75.13 పైసలుగా ఉంది. దేశీయంగా అతిపెద్ద ఇంధన రిటైల్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ధరల ప్రకారం పెట్రోల్ ధర ముంబయిలో అత్యధికంగా 91.56 పైసలుగా ఉంది. డీజిల్ రూ.81.87 పైసలుగా ఉంది.
ఇక హైదరబాద్ లో పెరిగిన ఇంధన ధరలతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. పెరిగిన ధరలతో హైదరాబాద్ లో డీజిల్ ధర రూ.88.37 పైసలకు చేరింది. పెరిగిన ఛార్జిలతో డీజిల్ ధర రూ.81.99 పైసలకు చేరింది. రోజు రోజుకు పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే కరోనా మహమ్మారిన పడి వ్యాపారాలు లేక, ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇపుడు రోజు రోజుకు చమురు ధరలు పెరుగుతుండటంతో ఆ భారం నిత్యవసర సరుకుల మీద పడుతోంది.
మారకం విలువలో హెచ్చుతగ్గులు:
విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్ కంపెనీలు ఎప్పటికప్పుడు సవరిస్తూ ఉంటాయి. డాలరుతో రూపాయి మారకం విలువలో హెచ్చు తగ్గులు, దేశీయంగా పన్నులులాంటి అంశాలు చమురు ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.