విక్రం రెడ్డి
…………….
ఓ దేవుడా..!
నిన్ను ప్రశ్నించలేం
పొగడడం తప్ప
ఇవి కూడా పొగడ్తలే
అనుకో
నువ్వు
నియమించింది
శిష్యులని, నమ్మినబంటులని
అదీ
ఎందరినో బాధకి గురిచేసి
గుమాస్తల కన్న హీనంగా
కొందరి మనోభావాలకు
అనుకూలంగా
అన్యాయంగా బదిలీలు చేసిన
ఓ దేవుడా !
ఓ భాషాభిమాని
ఇక
నీ “మాయ”ఘోష
మాకు వినిపించదా..!
నీ చిత్రాల ఫ్లెక్షీలు కనిపించవా..!
నీ దర్శనాలు లేక ఏడుకొండలవాడు చిన్నపోడా..!
పత్రికల్లో హెడ్డింగ్ ఏమి పెట్టించాలో
తోచక యజమానులు తలలు పట్టుకోరా..?
దేనికైనా ముగింపు తప్పదు
ఇక
నీకు సెలవు
ఓ దేవుడా
చరిత్ర నిన్ను క్షమిస్తుందా..!
చెప్పని కట్టలు
నిన్ను వెక్కిరించకుండా వుంటాయా..!
నిన్ను వెంటాడకుంటావుంటాయా..?
మానసికంగా
అవి వెంటాడక పోయినా
దేశ ప్రజలు
నిన్ను చూసి నవ్వుకుంటారు
నవ్వుకుంటున్నారు
తెలియని పిచ్చివాళ్ళు
లబ్ది పొందిన వాళ్లు
నువ్వేదో గొప్ప అని అనుకోవచ్చు
ఒక్క మాట చెప్పు
గంతలు తీసి
దేవత కళ్ల లోకి చూడగలవా..?
ఓ దేవుడా..?
ఓ దేవుడా..?
(కవి న్యాయవాది)