* క్రికెట్ యాంకర్ ను పెళ్ళాడనున్న బుమ్రా
* పెళ్లి కోసం క్రికెట్ కు విరామమిచ్చిన పేసర్
భారత స్టార్ బౌలర్, యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా కాబోయే భార్య ఎవరో తేలిపోయింది. ఇంగ్లండ్ తో నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని ఆఖరి టెస్టు నుంచి ఐదు మ్యాచ్ ల టీ-20 సిరీస్ కు సైతం దూరమైన బుమ్రా…వ్యక్తిగత కారణాలతో సెలవు తీసుకొన్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అయితే…బుమ్రా ఓ ఇంటివాడు కాబోతున్నాడని, పెళ్లి పనుల కోసం క్రికెట్ కు విరామమిచ్చినట్లుగా వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాదు…దక్షిణ భారత నటి, మళయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ను జీవితభాగస్వామిని చేసుకోబోతున్నాడంటూ మీడియాలో ప్రచారం జోరందుకొంది.
Also Read : టీ-20 ల్లో భారత్ ను ఊరిస్తున్న టాప్ ర్యాంక్
అయితే…అనుపమ పరమేశ్వరన్ తల్లి మాత్రం తమ కుమార్తెకు బుమ్రా స్నేహితుడే కానీ, వారిద్దరి మధ్య ప్రేమ, పెళ్లి లాంటివి లేనేలేవని తేల్చి చెప్పింది.
అనుపమ పోయే… సంజనా వచ్చే
దీంతో…ఓ వైపు పెళ్లి పనులు చకచకా చేసుకొంటున్న బుమ్రా జీవితభాగస్వామి ఎవరన్న అన్వేషణ ప్రారంభమయ్యింది. దానికి సమాధానంగా క్రికెట్ యాంకర్ సంజన గణేశన్ అన్నపేరు బయటకు వచ్చింది.
గోవా వేదికగా మార్చి 14, 15 తేదీలలో సంజనాను బుమ్రా పెళ్లాడబోతున్నట్లు వార్త బయటకు వచ్చింది.
Also Read : సమఉజ్జీల సమరానికి అంతా సిద్ధం
క్రికెట్, బ్యాడ్మింటన్ యాంకర్ సంజన
28 సంవత్సరాల సంజన గణేషన్ కు క్రికెట్ యాంకర్ గా, టీవీ ప్రయోక్తగా, రియాల్టీ షోలు చేయటంలో అందివేసిన చేయిగా గుర్తింపు ఉంది. మోడల్ గా తన కెరియర్ ను ప్రారంభించిన సంజన ఎమ్టీవీ రియాల్టీ షోల ద్వారా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకట్టుకోగలిగింది.
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ ప్రెజెంటర్ గా, స్టార్ స్పోర్ట్స్ ..మ్యాచ్ పాయింట్, చీక్కీ సింగిల్స్ లాంటి కార్యక్రమాలు నిర్వహించింది. ఇంగ్లండ్ లో పర్యటించి వివిధ జట్ల అభిమానులతో సైతం పలు రకాల కార్యక్రమాలు చేసింది.
అంతేకాదు…ఐపీఎల్, ఇండియన్ సాకర్ లీగ్ వేలం కార్యక్రమాలలో సైతం హోస్ట్ గా పనిచేసింది. 2018 ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం కార్యక్రమంలో హోస్ట్ గా వ్యవహరించింది.
Also Read : టీ-20 సిరీస్ లో అతిపెద్ద సమరం
మొత్తం మీద…మెరుపుతీగ లాంటి సంజన తో యార్కర్ల కింగ్ , బూమ్ బూమ్ బుమ్రా జీవితభాగస్వామ్యాన్ని ప్రారంభించబోతున్నాడు. ఏగూటి పక్షులు ఆ గూటికే చేరతాయన్నట్లు…క్రికెటర్ బుమ్రా…క్రికెట్ యాంకర్ ను లవ్ యార్కర్ తో క్లీన్ బౌల్డ్ చేయటంలో ఆశ్చర్యం ఏమీలేదు.
Also Read : భారత క్రికెట్లో ప్రతిభావంతుల అతివృష్టి