Saturday, January 25, 2025

సోమరులకు ప్రపంచంలో స్థానం లేదు

భగవద్గీత – 10

నాలుగు  మూలలా  నాలుగు ఇటుకలు  పెట్టి ,  నలుగురు గడ్డం పెంచుకున్న వాళ్ళు, నాలుగు కట్టెలేస్తూ అందులో నేయి పోస్తూ చూపిస్తారు మన సినిమాలలో. దానిని మనం యజ్ఞం అని అనుకుంటున్నాం. మనలో చాలా మంది మనస్సులో ఈ భావన ముద్ర వేయబడి ఉన్నది. అలాగే గడ్డం పెంచుకున్న వారంతా మునులు, ఋషులు అని కూడా అనుకుంటున్నాము.

Also read: సత్యాన్వేషణలో మూడు మార్గాలు

మరి ముని ఋషి అంటే ఎవరు?

మౌనంగా ఏదయినా మంత్రాన్ని గాని సత్యాన్ని గురించిగానీ ధ్యానించే వాడు ‘‘ముని’’.  సత్యావిష్కరణ (ఋతము) గావించే వాడు ఋషి (scientist) అన్నమాట!

మరి యజ్ఞం అంటే ఏమిటి?

‘‘చర్య, ప్రతిచర్య సమానము మరియు వ్యతిరేకము’’.  ఇది న్యూటన్‌ మూడవ సూత్రము. ఇది సిద్ధాంతం! అంటె Theory ..మరి ప్రయోగము? Practical. రాకెట్‌ పంపే అంతరిక్ష కేంద్రాలు! రాకెట్‌ ఆ సిద్ధాంతానికి అనుగుణంగా, మరికొన్ని ప్రాకృతిక ధర్మాలను అనుసంధానం చేస్తూ చేసేదేకదా! ఇది యజ్ఞము! Practical!

Also read: ప్రసాదభక్తి అంటే ఏమిటి?

అంటే ఒక సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని చేసే ప్రయోగం అన్నమాట. ప్రకృతిలో ప్రతిదీ ఒక సిద్ధాంతానికి లేదా ఒక ధర్మానికి కట్టుబడి ఉంది. వాటి ఆధారంగా చేయబడే ప్రతి ప్రయోగము ఒక యజ్ఞమే! అంటే ప్రతీ యజ్ఞము కర్మనుండి (పని)జనించినదే కదా?

ఇదే విషయాన్ని భగవానుడు చెపుతున్నారు!

సృష్టి మొదట్లో బ్రహ్మ (బృహ్మణ శక్తి కలిగినది! అంటే వ్యాపించే స్వభావము కలిగినది అన్నింటా వ్యాపించగలదు) ప్రజలను ఈ యజ్ఞ సహితముగా సృష్టించాడట. ఈ యజ్ఞములు మీకు కామధేనువు అగుగాక అని చెప్పారట. అంతే కదా! పని చేస్తే ఫలితం వస్తుంది. ఆ పనిని శ్రద్ధగా చేస్తే (కావలసినది ఇచ్చే) కామధేనువు అవుతుంది. ప్రాణులన్నీ కూడా అన్నం (ఆహారం)నుండి పుడుతున్నవి. ఈ అన్నం వర్షం వలన పుడుతున్నది. ఈ వర్షము యజ్ఞము వలన కలుగుతున్నది.

Also read: ఏది పగలు, ఏది రాత్రి?

సముద్రంలో నీరు ఆవిరై మేఘంగా మారి మరల ఆ మేఘం చల్లారినప్పుడే కదా వర్షం కురిసేది. It is a process. ఇంత పని జరిగితేనే కదా వర్షం కురిసేది. అంటే యజ్ఞం కర్మ వలననే కదా సంభవిస్తున్నది?

’’అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః

యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞత్కర్మ సముద్భవః’’

భగవానుడు (Do your duty) విహితకర్మ చేయమని చెపుతున్నాడు. అసలు పని లేకుండా ప్రపంచమే లేదు.

మనిషి చనిపోయే ముందు క్షణం వరకు కూడా గుండె, ఊపిరితిత్తులు, మెదడు అన్నీ ‘‘పని’’ చేస్తునే ఉంటాయి! కాబట్టి పని చేయని సోమరిపోతుకు ఈ ప్రపంచంలో స్థానం లేదు!

‘‘World is not for indolent and lazy’’ అని అంటారు స్వామీ వివేకానంద!

Also read: నిండిన చెరువు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles