* ఆరు నగరాలకే ఐపీఎల్ 2021 పరిమితం
ఐపీఎల్ 14వ సీజన్ పోటీల వేదికల్లో హైదరాబాద్ పేరు మాయమయ్యింది. కరోనావైరస్ తీవ్రతనేపథ్యంలో…కేవలం ఆరు నగరాల పేర్లను మాత్రమే ఐపీఎల్ పాలకమండలి పరిగణనలోకి తీసుకొంది.
ముంబై, చెన్నై, బెంగళూరు,కోల్ కతా, అహ్మదాబాద్, ఢిల్లీ నగరాలలో ఐపీఎల్ లీగ్ దశను, ప్లేఆఫ్ రౌండ్ పోటీలను పూణే, ముంబై, అహ్మదాబాద్ నగరాలలో నిర్వహించాలని యోచిస్తున్నారు.
Also Read : ఆఖరిటెస్టుకు బుమ్రా దూరం
మరోవైపు…ఐపీఎల్ వేదికల జాబితాలో హైదరాబాద్ ను చేర్చాలని రాష్ట్ర్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు బీసీసీఐని కోరారు. తెలంగాణా రాష్ట్ర్రంలో కోవిడ్ తీవ్రత చాలాతక్కువగా ఉందని, రానురాను కేసుల సంఖ్య తగ్గటమే దానికి నిదర్శనమని ట్విట్టర్ ద్వారా తెలిపారు. హైదరాబాద్ ను వేదికగా ఎంపిక చేస్తే తమ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయసహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు.
Also Read : రెండురోజుల ఓటమిపై ఇంగ్లండ్ మాజీల ఆక్రోశం
ఖాళీ స్టేడియంలోనే ముంబై మ్యాచ్ లు
ముంబై మహానగరం వేదికగా జరిగే ఐపీఎల్ మ్యాచ్ లను ఖాళీ స్టేడియంలోనే నిర్వహించాలని ప్రాంచైజీ యాజమాన్యం నిర్ణయించింది. మహారాష్ట్ర్రలో కరోనా మరోసారి తీవ్రం కావడం, అక్కడి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లాక్ డౌన్ ప్రకటించడం కూడా ఐపీఎల్ నిర్వహణపైన ప్రభావం చూపింది.
ఇదంతా చూస్తుంటే ఐపీఎల్ -13వ సీజన్ పోటీలను గల్ఫ్ లోని మూడుదేశాలలో…బయోబబుల్ వాతావరణంలో నిర్వహిస్తే…ఐపీఎల్ 14వ సీజన్ పోటీలను సైతం.. బయోబబుల్ వాతావరణంలోనే నిర్వహించడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read : మోడీ స్టేడియం పిచ్ పై విమర్శల వెల్లువ