మూడో ఫ్రంట్ ఏర్పాటు చేసి నడిపించే సత్తా కేసీఆర్ కు ఉంది
కాంగ్రెస్ లేకుండా బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ కడతామని శివసేన అనలేదు
కాంగ్రేస్, బిజెపేీ పార్టీలకు ప్రత్నామ్నాయంగా మూడో ఫ్రంట్ ఏర్పాటు చేసే ప్రయత్నంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మహరాష్ట్ర పర్యటన తర్వాత శివసేన ఎంపి సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యాలు చేశారు.కాంగ్రేస్ లేకుండా బిజెపికి వ్యతిరేకంగా కూటమిని కట్టలేమని శివసేన ఎంపి సంజయ్ రౌత్ చెల్చిచేప్పారు. తాము కూడ కాంగ్రెస్ లేకుండా బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లేకుండా రాజకీయ ఫ్రంట్ ఏర్పడుతుందని మేము ఎప్పుడూ చెప్పలేదు. మమతా బెనర్జీ రాజకీయ ఫ్రంట్‌ను సూచించిన సమయంలో, కాంగ్రెస్‌ను వెంట తీసుకెళ్లాలని మాట్లాడిన మొదటి రాజకీయ పార్టీ శివసేననేన అని అన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ కాంగ్రెస్‌ను మినహాయించి పొత్తు గురించి ఆలోచిస్తున్నట్లు రౌత్ చెప్పుకోచ్చారు. బిజెపి పాత పార్టీని జాతీయ రాజకీయాలకు దూరంగా ఉంచడం, యుపిఎకు సమాంతరంగా ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేయడం వల్ల అధికార బిజెపిని మరియు “ఫాసిస్ట్” శక్తులను బలోపేతం చేయడమే అవుతుందని చేప్పారు. అయితే మూడవ కూటమి ఏర్పాటు చేసేందుకు,దాన్ని నడిపించేందుకు కేసీఆర్ కు సత్తా ఉందని అన్నారు.
Also read: కేసీఆర్ మహరాష్ట్ర పర్యటన సందేశం ఏమిటి? – ఒబిసి మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్న
Also read: కెసిఆర్ ముంబై పర్యటనలో ప్రకాష్ రాజ్ పాత్రపై సర్వత్రా అసక్తి
Also read: దేశంలో గుణాత్మక మార్పులు రావాలి-కేసీఆర్
Also read: జాతీయ ఎజెండాతో కేసీఆర్ అడుగులు