- సఫారీ-కంగారూ సిరీస్ రద్దుతో మార్గం సుగమం
- ఫైనల్స్ రెండో బెర్త్ కోసం మూడుస్తంభాలాట
అంతర్జాతీయ క్రికెట్ మండలి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ ఫైనల్స్ కు న్యూజిలాండ్ చేరుకొంది. సౌతాఫ్రికా వేదికగా మరికొద్దిరోజుల్లో ప్రారంభంకావాల్సిన మూడుమ్యాచ్ ల టెస్టుసిరీస్ ను ఆస్ట్ర్రేలియా రద్దు చేసుకోడంతో…కివీజట్టు అలుపుసొలుపు లేకుండా ఫైనల్స్ చేరుకోగలిగింది.
Also Read : చెన్నై టెస్టుకు కౌంట్ డౌన్
ఇప్పటి వరకూ ఆడిన ఐదు సిరీస్ లు , 11 టెస్టు మ్యాచ్ ల్లో న్యూజిలాండ్ 7 విజయాలు, 4 పరాజయాల రికార్డుతో మొత్తం 420 పాయింట్లు సాధించి నేరుగా ఫైనల్స్ కు అర్హత సంపాదించింది.
క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా 2021 జూన్ లో జరిగే ఫైనల్స్ లో న్యూజిలాండ్ పోటీపడుతుంది. ఫైనల్లో న్యూజిలాండ్ తో ఢీ కొనడానికి అర్హత కోసం భారత్, ఇంగ్లండ్, ఆస్ట్ర్రేలియాజట్ల మధ్య మూడుస్తంభాలాట జరుగుతోంది.
Also Read : చెన్నై టెస్టులో రోహిత్ జోడీ ఎవరో?
ఇంగ్లండ్ తో జరిగే నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ ను భారత్ 2-1తో నెగ్గినా ఫైనల్స్ చేరుకోగలుగుతుంది. రెండుమ్యాచ్ లు ఓడితే ఫైనల్స్ బెర్త్ ఆశలకు నీళ్లు వదులుకోక తప్పదు.