- మూడోర్యాంక్ కు పడిపోయిన భారత్
సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో భారత్ ఆధిపత్యానికి న్యూజిలాండ్ గండికొట్టింది. గత కొద్ది సంవత్సరాలుగా తిరుగులేని టాప్ ర్యాంకర్ గా ఉన్న భారత్…కరోనా దెబ్బతో తొలిసారిగా మూడోర్యాంక్ కు పడిపోయింది.ఐసీసీ ప్రకటించిన టెస్ట్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం న్యూజిలాండ్, ఆస్ట్ర్రేలియా, భారతజట్లు మొదటి మూడుర్యాంకుల్లో నిలిచాయి.
ఇది చదవండి: సిడ్నీలో భారత్-కంగారూ టగ్ -ఆఫ్- వార్
కివీస్ చేతిలో పాక్ చిత్తు…
ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న మూడుమ్యాచ్ ల టెస్టు సిరీస్..మొదటి రెండుమ్యాచ్ లు ముగిసే సమయానికే ఆతిథ్య న్యూజిలాండ్ 2-0 ఆధిక్యంతో విజేతగా నిలవడం ద్వారా…టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంక్ ను కైవసం చేసుకొంది.
క్రైస్ట్ చర్చి వేదికగా జరిగిన రెండోటెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 176 పరుగులతో పాకిస్థాన్ ను చిత్తు చేసింది. ఈ సిరీస్ విజయంతో న్యూజిలాండ్ ర్యాంకింగ్ పాయింట్లు 118కి చేరాయి.
ఎట్టకేలకు టాప్ ర్యాంక్ లో….
టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంక్ కోసం గత పదేళ్లుగా పోరాడుతున్న న్యూజిలాండ్ ఎట్టకేలకు తన లక్ష్యాన్ని చేరుకోగలిగింది. కివీ దెబ్బతో ఆస్ట్ర్రేలియా 116 పాయింట్లతో రెండు, 114 పాయింట్లతో భారత్ మూడు ర్యాంకులకు పరిమితం కావాల్సి వచ్చింది. 106 పాయింట్లతో ఇంగ్లండ్ నాలుగు, 96 పాయింట్లతో సౌతాఫ్రికా ఐదు ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి.గత దశాబ్దకాలంలో టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంక్ సాధించిన ఆరోజట్టుగా, ఓవరాల్ గా నంబర్ వన్ ర్యాంక్ సాధించిన 7వ జట్టుగా న్యూజిలాండ్ రికార్డుల్లో చేరింది.
విరాట్ , స్మిత్ లకు కేన్ చెక్…
టెస్ట్ క్రికెట్ ఆటగాళ్ల టాప్ ర్యాంక్ లో ఇప్పటి వరకూ మొదటి రెండుస్థానాలలో నిలిచిన స్టీవ్ స్మిత్, విరాట్ కొహ్లీలను న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్ అధిగమించాడు. టాప్ ర్యాంక్ ను కైవసం చేసుకొన్నాడు. గత ఆరు ఇన్నింగ్స్ లో రెండు డబుల్ సెంచరీలు సాధించడం ద్వారా కేన్ విలియమ్స్ సన్ ఈ ఘనతను
సొంతం చేసుకోగలిగాడు.
ఇది చదవండి: రహానేను ఊరిస్తున్న అరుదైన రికార్డు