- హాజరైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, ప్రఖ్యాత సంగీత దర్శకుడు గౌతమ్ వాసుదేవ్
తెలంగాణ జాగృతి రూపొందించిన బతుకమ్మ పాట “అల్లిపూల వెన్నెల” ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ మంగళవారంనాడు విడుదల చేశారు. ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ ఈ పాటకు సంగీతం అందించారు. ప్రఖ్యాత దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించారు.
తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ మరోసారి విశ్వయవనికపై మెరవనుంది. ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో బతుకమ్మ పాట “అల్లిపూల వెన్నెల”గా సరికొత్త సొబగులు అద్దుకుంది. బతుకమ్మ ఆట, పాటను తెలంగాణ ఆత్మగౌరవ పతాకంగా లోకానికి పరిచయం చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పాటను నిర్మించారు. ప్రఖ్యాత దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించిన ఈ పూల సింగిడిని ఇవాళ ఆయనతో కలిసి ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో విడుదల చేశారు. ఉత్తరా ఉన్నికృష్ణన్ పాడిన ఈ పాటకు ప్రముఖ రచయిత మిట్టపల్లి సురేందర్ లిరిక్స్ అందించగా, జాతీయ అవార్డు గ్రహీత బ్రిందా కొరియోగ్రఫీ చేశారు.
Also read: అత్యంత ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ పాట?
అక్టోబర్ 6 నుండి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తంగా ఘనంగా జరగనుంది. తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో సంబురంగా జరుపుకునే ఈ పండుగకు “అల్లిపూల వెన్నెల” పాట మరింత శోభను తీసుకొస్తుంది. ఈ పాటను తెలంగాణలోని వివిధ లొకేషన్లలో ఎంతో అందంగా చిత్రీకరించారు. పాటను విడుదల చేసిన సందర్భంగా, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ట్విట్ చేశారు. “బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!
A festival of life.
A celebration of togetherness.
Bringing you a glimpse of the beauty of Bathukamma
through “#AllipoolaVennela” along with Telangana Jagruthi” అంటూ ఏఆర్ రెహమాన్ ట్వీట్ చేశారు.
దీనికి స్పందనగా “The festival of colours, melody and togetherness Bathukamma is here! Here’s sharing a glimpse of the special song for Bathukamma by @arrahman @menongautham and a dream team for all my sisters” అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.
తెలంగాణలో మాత్రమే జరుపుకునే ప్రత్యేకమైన పూల పండుగ బతుకమ్మ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయడంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలోని తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయం నుండి తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలను కాపాడటంలో తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషించింది.
Also read: అక్టోబర్ 2 నుండి బతుకమ్మ చీరల పంపీణి