ఢిల్లీ బోర్డర్లలో కేంద్రం ప్రవేశపెట్టిన మూడు చట్టాలను రద్దు చేయాలని రైతులు కుటుంబాల తో సహా చేస్తున్న సత్యాగ్రహం లో మహిళల పాత్ర చారిత్రాత్మకమైనది. మద్ధతు గా వచ్చిన మహిళల పై కేసులు నమోదయ్యాయి.. జైలుకు కూడా వెళ్లారు…ఈ నెల 8 న మహిళా దినోత్సవం సందర్భంగా ఉద్యమ కమండలమును మహిళలు చేపడుతున్నారు… పూనమ్ పాండే లాంటి జాతీయ షూటర్ ఉద్యమం ప్రారంభం నుంచి బోర్డర్లలోనే ఉండి మద్దతు తెలుపుతున్నారు.. నవదీప్ కౌర్ లాంటి సామాజిక కార్యకర్తలు ..దిశా రవి లాంటి వారు నిర్బందాలను ఎదుర్కొన్నారు…మహిళలు దేశంలో జరిగిన సీఏఎ వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రధాన పాత్ర పోషించారు.
Also Read : గృహిణులకు జీతాలు ఇవ్వాలి
దేశంలో నిరంతరం జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.. మహిళా హక్కుల పరిరక్షణ కోసం గృహ హింస కు వ్యతిరేకంగా.. పోరాడుతున్నారు… ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు… గెలుస్తున్నారు.. పదవుల్లో అరకొర మాత్రమే ఉంటున్నారు.. ఈ నేపథ్యంలో బెంగాల్ సీఎం గా ఉన్న దీదీ.. మమతా బెనర్జీ అక్కడ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి తృణమూల్ కాంగ్రెస్ నుంచి 50 మంది మహిళలకు టిక్కెట్లు ఇవ్వడం స్వాగతించాల్సిన.. ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిణామం అంటే అతిశయోక్తి కాదు. ప్రతీ పాలక వర్గంలోను 50 శాతం రిజర్వేషన్లు ఉండాలి.
Also Read : మహిళలు పురుషులతో సమానం కాదు, వారి కంటే అధికులు
సమాన పనికి సమాన వేతనం ఇంకా పెండింగ్ లోనే ఉన్న డిమాండ్. మహిళా దినోత్సవం సందర్భంగా నాడు మహిళల అభ్యున్నతి పై ఉపన్యాసాలు ఇచ్చే నేతలు ఆచరణ విషయానికి వచ్చేసరికి మిన్నకుండి పోతున్నారు.. పోరాట ఆరాట శక్తి సామర్ధ్యాలను పరిశీలించినపుడు సైతం మహిళలే ముందున్నారు. ఉంటున్నారు.. నిజాయితీ పట్టుదల చిత్తశుద్ది లోను నెంబర్ వనే.. ఇందుకు చాలా నిదర్శనాలు ఉన్నాయి…వంద రోజుల కు పైగా జరుగుతున్న అన్నదాతల పోరులో మహిళల పాత్ర అద్భుతమైనది….