• మహాగట్ బంధన్ వైపు మొగ్గుచూపిన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్
• మరి కొద్ది గంటల్లో తేలనున్న నితీష్ కుమార్ భవితవ్యం
• సాధారణ మెజారిటీ మార్క్ ను దాటిన ఎన్డీఏ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు క్షణ క్షణం మారిపోతూ తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఫలితాల సరళిని చూస్తే సీఎం పీఠం కోసం ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటమి తీవ్రంగా పోటీ పడుతున్నాయి. హోరాహోరీగా సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోరులో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ మార్క్ ను దాటింది. ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే మహాకూటమి ఆధిక్యంలో దూసుకుపోయింది. అయితే ఆ తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోతూ … ఎన్డీఏ మ్యాజిక్ మార్క్ ను అందుకుంది.
తేజస్వి వైపు మొగ్గుచూపిన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్
మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం తేజస్వీ యాదవ్ క్లీన్ స్వీప్ చేస్తారని అంచనావేశాయి. కాని ఫలితాల సరళి మాత్రం భిన్నంగా ఉంది. 243 స్థానాలకు గాను మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఎన్డీఏ 130 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. నితీష్ కుమార్ నాలుగో సారి రాష్ట్ర పగ్గాలు చేపడతారో లేదో మరికొద్ది గంటల్లో తేలనుంది.
ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే మహాగట్ బంధన్ కొంత ఆధిక్యం దిశగా సాగింది. కాని రాను రాను ఫలితాల సరళి మారిపోతూ తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. 38 జిల్లాల్లో 55 కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. లోక్ జన్ శక్తి పార్టీ ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలను రాబడుతోంది. సాధించే దిశగా సాగుతోంది. బీఎస్పీ 2 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది.
హంగ్ ఏర్పడితే …!
ఫలితాల సరళి మాత్రం ఆద్యంతం ఆసక్తిగా నువ్వా నేనా అన్న రీతిలో సాగుతోంది. దీంతో తుది ఫలితాలు వచ్చే వరకు విజేత ఎవరనేది అంచనా వేయడం కాస్త కష్టం. ఫలితాలు తారుమారై ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే లోక్ జన్ శక్తి పార్టీ, బీఎస్పీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కీలక భూమిక పోషించనున్నారు.