Thursday, November 21, 2024

సిలికానాంధ్ర సంపద ఆధ్వర్యంలో ‘నాట్యకీర్తనం’

భారతీయ కళలు, సంప్రదాయాలు, మాతృభాషకు పెద్ద పీట వేస్తూ, గత 2 దశాబ్దాలకు పైగా విలక్షణమైన కార్యక్రమాలు నిర్వహించే సిలికానాంధ్ర, ఇప్పుడు SAMPADA (“Silicon Andhra Music, Performing Arts and Dance Academy”) ఆధ్వర్యంలో  నాట్య కీర్తనం అనే కొత్త కార్యక్రమం ప్రారంభించింది. తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమయ్య, భక్త రామదాసు లాంటి  మరెంతో మంది వాగ్గేయకారులు మనకు అందించిన సంగీత, సాహిత్య సంపదను శాస్త్రీయ నృత్యాల ద్వారా విస్త్రుత ప్రాచుర్యం కల్పించి వారి గొప్పతనాన్ని భావి తరాలకు అందించాలనే సత్సంకల్పంతో కొన్ని ప్రత్యేక కీర్తనలను ఎంపిక చేసి, అ సాహిత్యం లోని ప్రతి పదానికి , వాక్యానికి తెలుగు మరియు ఆంగ్ల భషలలో అర్ధాన్ని అందించి, కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలకోసం ప్రత్యేకంగా స్వరపరచి, నృత్య కళాకారులకు అందుబాటులోకి తీసుకొని రావడమే ‘నాట్య కీర్తనం’ లక్ష్యమని సంపద అధ్యక్షులు దీనబాబు కొండుభట్ల తెలిపారు.

సంగీత, నాట్య రంగాలలో నిష్ణాతులు మరియు విద్యావేత్తల బృందం సహకారంతో, శ్రీ పప్పు వేణుగోపాల్రావు మరియు అన్నమయ్య కీర్తనలపై అపారమైన పరిశోధనలు చేసిన శ్రీ వేటూరి ఆనంద మూర్తి గారు లాంటి పెద్దల మార్గ నిర్దేశకత్వంలో, సిలికానాంధ్ర విశ్వ విద్యాలయం అధ్యాపకుల సహకారంతో మొదటగా అన్నమయ్య, రామదాసు కీర్తనలను సిద్ధం చేశామని, తొలి ప్రయత్నంగా Dr. అనుపమ కైలాష్ నాయకత్వంలో 10 అన్నమయ్య కీర్తనలకు, Dr.యస్శోద థాకూర్ నాయకత్వంలో 5 రామదాసు కీర్తనలను రికార్డు చేయడం పూర్తయిందని, రాబోయే 2-3 సంవత్సరాలలో , కనీసం 100 కీర్తనలను సిద్ధంచేయాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు, దీని ద్వారా నాట్య కళాకరులలోని సృజనాత్మకతను మరింత గా వెలికితీసే అవకాశం వుంటుందని దీనబాబు కొండుభట్ల తెలిపారు.  

నాట్యకీర్తనం ప్రొజెక్ట్ ద్వారా స్వరపరచిన కీర్తనల ప్రచారంలో భాగంగా,  భారతదేశంలోనే కాక అమెరికా, యూకే వంటి దేశాలలో స్థిరపడ్డ జాతీయ పురస్కారాలందుకున్న యువ కళాకారులచే నృత్య రీతులను సమకూర్చి జనవరి 23, 24 వ తేదీలలో సామాజిక మాధ్యమాలైన FACEBOOK, YOUTUBE  ద్వారా ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నామని ఈ కార్యక్రమాలప్రత్యక్షప్రసారాలు  facebook.com/siliconandhrasampadayoutube.com/sampadatv ద్వారా అందరు చూడవచ్చని సంపద కార్యవర్గ సభ్యులు ఫణిమాధవ్ కస్తూరి తెలిపారు. ఈ ప్రదర్శనలలో అపర్ణ ధూళిపాల (హైదరాబాద్), అవిజిత్ దాస్ (బెంగలూరు), దివ్య రవి(UK), కాశి ఐసోలా(USA), పాయల్ రాంచందాని(UK), T రెడ్డి లక్ష్మి(Delhi), రెంజిత్ & విజ్ఞ (చెన్నై),స్నేహ శశికుమార్(కేరళ), గీతా శిరీష(బెంగళూరు), ఉమా సత్యనారాయణన్(కేరళ) పాల్గొంటుండగా, డా. అనుపమ కైలాష్ సంధానకర్తగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles