- ముచ్చటగా మూడు పుట్టపర్తి, నాసిన్, కియా
- కరవు సీమలో రత్నాలు
- జాతికి అంకితం చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
- హాజరైన గవర్నర్, వై ఎస్ జగన్
అంతర్జాతీయ స్థాయికి మరోసారి అనంతపురం జిల్లా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఆధ్యాత్మిక కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో పుట్టపర్తి కి సమీపంలో గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద 503 ఎకరాల్లో దాదాపు 700 కోట్లతో నిర్మించిన నాసిన్ శిక్షణ కేంద్రం మంగళవారం పీఎం నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు ఏపీ గవర్నర్ హా జరైయ్యారు. అంతర్జాతీయ కస్టమ్ సంస్థ నాసిన్ గుర్తించింది. నాసిన్ శిక్షణ కేంద్రంలో ప్రధానంగా ఇండియన్ రెవెన్వు సర్వీస్ కు ఎంపిక ఐన ఐఆర్ఎస్ కేడర్ కు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ లో కష్టమ్స్, ఇండైరెక్ టాక్స్, నార్ కోటిక్ వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. ఐఏఎస్ లకు ముస్సోరి, ఐపీ ఎస్ హైద్రాబాద్ లో శిక్షణ ఎలా ఇస్తారో నాసిన్ లో ఐఆర్ఎస్ లకు శిక్షణ ఇస్తారు. కేంద్రం ఎంపిక చేసిన ఇతర రంగాల్లో వారికీ సైతం ఇక్కడ శిక్షణ ఇవ్వడాకి అవకాశాలు వున్నాయి. నాసిన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు తో చుట్టుపక్కల గ్రామాల నిరుద్యోగ యువత కు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. జాతీయ రహదారి 44 కు సమీపంలో నాసిన్ కేంద్రం వుంది. పెనుకొండ వద్ద ఉన్న కియా కార్ల ఉత్పత్తి కేంద్రం నాసిన్ కు 20 కిలోమీటర్లు దూరంలో వుంది.