ప్రేమ సృష్టికి ఆధారం
ప్రపంచాన్ని నడిపించేది
ఆశకు మూలమైంది.
రాముడి ప్రేమ ఆదర్శమైంది
జీసస్ ప్రేమ వెలుగు నింపింది
రావణుడి ప్రేమ విషమైంది.
ఏమిటీ ప్రేమ
ఇష్టమైన వాటిపై ప్రేమ
ప్రేమంటే నా ఇష్టమేగా
ఇష్టమనే నా భావన మీదేగా
నా ప్రేమ నామీదేగా
మరి వాటిమీద, వీరిమీద ఉన్నది
భ్రాంతి అంటారా
మాయ అందామా
ఎవరు ఏమన్నా
ఒకటి మాత్రం స్పష్టం
మన ప్రేమ మనపైనే
నార్శిసస్ లాగా.
మన బంధం, అనుబంధం
బయటి వ్యక్తి, వస్తువు, విషయంతో కాదు
దాని గురించిన మన మనో భావనతోనే.
Also read: “అమ్మకు ప్రేమతో”
Also read: “జీవిత చక్రం”
Also read: “రాజ మార్గం”
Also read: “సారం”
Also read: “శంకరం”