శ్రీమాన్ లక్ష్మీనరసింహన్ ప్రవచనం
ఇది 23వ పాశురంలో నరసింహుడికే సర్వవ్యాపకత్యం గురించి అని టిటిడి వక్త, గాయకుడు, ప్రవచన ప్రముఖుడు శ్రీమాన్ కె ఇ లక్ష్మీనరసింహన్ వివరించారు. నిన్న (22వ పాశురంలో) మేం అందరం కలిసి వచ్చి మీ ముందుకు ఉన్నాం అన్న మాట వెనుక చాలా అర్థాలు వివరించుకున్నాం. నీకేంగావాలి అందరి ముందూ చెప్పగలనా? మీరు సింహాసనంలో కూర్చుని తీరికగా నా దర్బార్ లో చెప్పుకుంటాం అంటున్నాడు శ్రీకృష్ణుడు. అయితే భక్తుడికి అనుగ్రహం ఇవ్వవలసిన వాడు దేవుడే గాని మనమేంజేస్తాం. నీ అనుగ్రహం ఉంటే నాదేమీ లేదు అంతా భగవంతుడిదే అని అంటూ ఉంటాం కాని నిజంగా వైరాగ్యం వస్తుందా. అవిగావాలి ఇవి గావాలి కోరుకుంటూనే ఉంటాం. ముందు చదువు, పెళ్లి పిల్లలు, తరువాత మనవలు, వారి బాగా చదువుకుని బాగుపడలనే కోరికలు కొనసాగుతూ ఉంటాయి కదా. ఇక ఎప్పుడు ఈ వైరాగ్యం వచ్చేది?
అది తెలుసుకోవడానికి విశ్వామిత్రుడి జీవిత కథ సమాధానమిస్తుంది. విశిష్టుడి కామధేనువు నాకివ్వాలని పోరాడుతాడు. బ్రహ్మలక్షణమై ముఖ్యం గాని, క్షత్రలక్షణం సరిపోదు, తపస్సు బలం రావాలని అర్థమైనా మేనక అందాలకు తపస్సంతే శక్తి బలిఅవుతుంది. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి, శునశ్యేపుడు రక్షించడానికి మరో లక్షల సంవత్సరాల తపస్సు వెచ్చిస్తాడు.
అర్థమేమంటే భగవంతుడి అనుగ్రహం ముఖ్యం.
మరో ఉదాహరణ ఒక భరతుడు, జడభరతుడు (రాముడి తమ్ముడు కాదు) అజనాభుడనే రాజు కొడుకు. విశ్వరూపి భార్య. పదేళ్లు పరిపాలించిన తరువాత వైరాగ్యుడై, భార్య పిల్లలు, రాజరికం అన్నీ వదిలి తపస్సు చేసుకుంటున్నాడు. ఓ సారి ముని ఆశ్రమంలో పులి లేడి ని వెంటపడుతూ ఉంటే నిండుగర్భణిగా వేగంతో వెళ్లలేక ప్రసవించి ప్రాణం కోల్పోయింది. ఆ లేడిని ప్రేమిస్తూ తపస్సు అంతా మరిచి లేడి బాగోగులు చూసుకోవడమే సరిపోయింది. చివరకి ఆ లేడికోసమే బతుకుతూ తరువాత ఏ విధంగా బతుకుందో కదా అని బాధపడుతూ మరణిస్తాడు. అదే ఆలోచనతో మరణించిన దశలో పునర్జన్మంలో జింకయై పుట్టాడు. మరో జన్మలో మనిషిగా పుట్టినా వైరాగ్యంతో పెరిగిపోతూ ఏమీ చెప్పడు, వినడు, కాదనడు, లేదనడు. దాన్నిజడభరతుడు అనే పిలిచే వారు. కాళిని నరబలిచేయడానికి ఎవరూ లేకపోతే జడభరతుడిని బలిచేయడానికి సిద్ధం చేసారు. కాని కాళి దయతో బతికించారు. ఒక పల్లకీ బోయీలలో ఒకడిగా జడభరతుడిని మోస్తూ ఉండగా సరిగ్గా మోయలేవడంలేదని పల్లకిపై వెళుతున్న రాహులుడనే వాడు జడభరతుడుని తిడుతూ ఉంటాడు. ఆ రాహులుడు వైరాగ్యం గురించి నేర్చుకోవడానికి కాని బోయీని తీవ్రంగా ఆమాత్రం మోయలేవా అంటే విసుగు పడి మాటడం మొదలుపెడతాడు. ఎందుకు తిడుతున్నావు నేనంటే మీమిటి నా శరీరాన్ని తిడుతున్నావా అని మూలమైన ప్రశ్నాలు అడుతుతూ ఉంటే రాహులుడు ఆశ్చర్యపోతాడు. కపిలముని శిష్యుడవుదామని వచ్చిన రాహులుడికి వైరాగ్యం గురించి అర్థమవుతుంది.
వైరాగ్యం బలవంతంగా రాదు
ఈ విధమైన వైరాగ్యం స్వయంగా రావాలసిందే గాని బలవంతంగా వైరాగ్యం రాదని అంటూ భగవంతుడి అనుగ్రహంతోనే వస్తుందని మరో ఉదాహరణ వివరిస్తాడు. ధర్మరాజు యక్షప్రశ్నలకు జవాబిస్తూ రోజూ అనేకమంది చనిపోతూ ఉంటూ చూసి కూడా మరునాటి రోజు బతుకుతామని అనుకునేదే భ్రమ, మాయ అని అర్థం చేసుకోవడానికి వైరాగ్యం అని వివరిస్తారు.
అళిహసింగరుడు
వైరాగ్యం కేవలం భగవంతుడి అనుగ్రహం వల్లనే జరుగుతుందీ అంటూ, లక్ష్మీనరసింహుడి దయవల్లనే సర్వమంతా వ్యాపించిన వాడికి లభిస్తుందని అంటాడు. ఆ నరసింహుడు అంతటా వ్యాపించిన వాడు అంటే సర్వవ్యాపిత్వ లక్షణం ఉన్న మరో దేవుడికి లేదు. భక్తుడైన ప్రహ్లాదుడి గా రక్షించిన ఆశ్రిత పాలన తెలిసిన నరసింహుడికే సర్వవ్యాపకత్య లక్షణం వస్తుందని, అందుకే వైరాగ్యం లభిస్తుందని, ఆ నరసింహుడు అందమైన అళిహసింగరుడి (అందమైన సింహమైనవాడు) దయలభిస్తుందని సింహాసనప్పాటు 23వ తిరుప్పావై పాశురంలో శ్రీమాన్ కె ఇ లక్ష్మీనరసింహన్ గారు వివరించారు.
Also read: నాకు మరేదారీ లేదు అంటేనే శరణాగతి
మాడభూషి శ్రీధర్