Sunday, December 22, 2024

ఆర్ఎస్ఎస్ ఆంధ్ర ప్రాంత సంఘచాలక్ గా హరికుమార్ రెడ్డి

నెల్లూరుకి చెందిన సీనియర్ ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త శ్రీ నాగారెడ్డి హరి కుమార్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత సంఘచాలక్ (రాష్ట్ర అధ్యక్షులు) గా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంత సంఘచాలక్ నియుక్తి కోసం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరగడం ఆనవాయితీ. ఈరోజు కృష్ణాజిల్లా మంగళగిరి మండలం నూతక్కి విజ్ఞాన విహార పాఠశాలలో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత (రాష్ట్ర) సమావేశాలలో సంఘచాలక్ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలలో సీనియారిటీతో పాటు ఉన్నత స్థాయి శిక్షణ పొందినవారికి ప్రాధాన్యం ఇస్తారు. హరికుమార్ రెడ్డికి ప్రజలతో సన్నోహిత సంబంధాలు ఉన్నాయి.

నెల్లూరు జిల్లా కోవూరు మండలం వేగూరులో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రెడ్డి అగ్రికల్చరల్ ఎం ఎస్ సీ చేశారు.1967వ సంవత్సరంలో వారి విద్యార్థి దశలో నెల్లూరులోని కస్తూరి దేవి నగర్ లో అప్పుడు ఉండిన విక్రమ శాఖ ద్వారా ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త గా నమోదైనారు. నెల్లూరు జిల్లా కార్యవాహ, నెల్లూరు విభాగ్ (నెల్లూరు, చిత్తూరు జిల్లాలు) కార్యవాహ, నెల్లూరు విభాగ్ సంఘచాలక్, ప్రాంత కార్యకారిణీ సదస్యులుగా వివిధ బాధ్యతలలో అవిరళంగా పని చేశారు. కార్యకర్తల ఆకాంక్ష మేరకే తాను ఈ బాధ్యతను స్వీకరించానని, కార్యకర్తల అభీష్టం, అంచనాల మేరకు ఆంధ్రప్రదేశ్ లో సంఘ కార్య విస్తరణకు యధాశక్తి కృషి చేస్తానని రెడ్డి అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles