Sunday, December 22, 2024

నాగచైతన్య, సమంత కటీఫ్

అశ్వనీకుమార్ ఈటూరు

  • నాగార్జున్, సిద్ధార్థ, ఖుష్బూ, కంగనా, రాంగోపాల్ వర్మల స్పందన
  • ముంబయ్ కి మకాం మార్చడం లేదని సమంత ట్వీట్

టాలీవుడ్ జంట నాగచైతన్య, సమంత విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ట్విట్టర్ వేదికగా ఇద్దరూ శనివారంనాడు ఒకేవిధమైన మెసేజ్ లు పెట్టారు. తమను అర్థం చేసుకొని తమ ఏకాంతతకు భంగం కలిగించవద్దని అభిమానులను కోరుకున్నారు.

చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామనీ, ఇద్దరం స్నేహంగా కొనసాగుతామనీ, భార్యాభర్తలుగా విడిపోతామనీ చెప్పారు. వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయనీ, విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారనీ కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వదంతులు నిజమని వారే రూఢి చేశారు.

తన వ్యక్తిగత జీవితం గురించి పుకార్లు రావడం తనకు బాధ కలిగించిందనీ, ఎవరేమనుకున్నా సరేనని భావించి వాటిని పట్టించుకోవడం మానేశాననీ నాగచైతన్య ఒక ట్వీట్ లో బాధ వెలిబుచ్చారు. తర్వాత ట్వీట్ లో సమంత పెట్టిన మెసేజ్ నే కొద్దిగా మార్చి పెట్టారు. తాను హైదరాబాద్ లోనే ఉంటాననీ, ముంబయ్ కి మకాం మారుస్తానంటూ వచ్చిన పుకార్లు నిజం కాదనీ సుమంత స్పష్టం చేసింది.

సమంత, నాగచైతన్య

సుమంత, నాగచైతన్య 2017లో గోవాలో పెళ్ళి చేసుకున్నారు. వీరు విడిపోవడం గురించి టాలీవుడ్ లో చర్చ జరిగింది. తాము సుమంతను బాగా అభిమానించామనీ, వివాహం అనేది వారి వ్యక్తిగతమనీ, తాను ఆ విషయంలో ఏమీ చెప్పజాలననీ, వారిద్దరూ ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటున్నాననీ, సుమంత తమతో కలిసి ఉన్నంత కాలం  సంతోషంగా ఉన్నదనీ, ఆమె ఎప్పటికైనా తమకు సన్నిహితమేననీ నాగచైతన్య తండ్రి నాగార్జున అన్నారు. శామ్, చా తనకు చాలా దగ్గరని వ్యాఖ్యానించారు. నాగచతన్యతో ప్రేమలో పడకముందు సమంత సిద్ధార్థను ప్రేమించింది. వారిద్దరూ  శ్రీకాళహస్తికి వెళ్ళి రాహువు, కేతు పూజ కూడా చేశారు. అభిమానులు ఆశ్చర్యపోయారు. చివరికి ‘ఏమాయచేశావే’  సినిమా షూటింగ్ సందర్భంగా నాగచైతన్యను పెళ్ళాడుతానని సమంత చెప్పింది. దాదాపు ఏడు సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత నాలుగేళ్ల కిందట నాగచైతన్య, సమంత పెళ్ళి చేసుకున్నారు.

సిద్ధార్థ స్పందించడం విశేషం. నాగచైతన్యతో సమంత పెళ్ళి జరిగిన తర్వాత నిశ్శబ్దంగా ఉండిపోయిన సిద్ధార్థ నిన్నటి వార్త తెలిసిన తర్వాత ట్వీట్ ఇచ్చాడు. ‘‘మోసం చేసేవాళ్ళు ఎన్నడూ బాగుపడరు,’’ అని ట్వీట్ పెట్టాడు. సమంత పేరు పేర్కొనకపోయినా ఆమెను ఉద్దేశించే మెసేజ్ పెట్టాడని అందరికీ తెలుసు.

నాగచైతన్, నాగార్జున

నాగచైతన్య, సమంత మధ్య ఏమి జరిగిందో ఇతరులకు ఎవ్వరికీ అవసరం లేదనీ, ఎవ్వరూ అనవసరంగా మాట్లాడకూడదనీ సినిమా నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ వ్యాఖ్యానించారు. ఎప్పుడు విడిపోయినా మగవారిని ఎవ్వరూ ప్రశ్నించరు, ఆడవారినే ప్రశ్నిస్తారంటూ కంగనా రావత్ వ్యాఖ్యానించారు. రామగోపాల్ వర్మ తనదైన తరహాలో వివాహం కంటే విడాకులే నయం అని మెసేజ్ పెట్టారు. ఈ సెలిబ్రిటీలు ఎవ్వరూ నాగచైతన్య, సమంతల పేర్లు రాయలేదు.

అక్కినేని కుంటుంబాన్ని విడాకులు వేధిస్తున్నాయనీ, అవి శాపంగా పరిణమించాయనీ అక్కినేని కుంటుంబం అభిమానులు బాధపడుతున్నారు. నాగార్జన స్వయంగా లక్ష్మికి విడాకులు ఇచ్చి అమలను వివాహం చేసుకున్నారు. నాగచైతన్య తల్లి లక్ష్మి. అమల కుమారుడు అఖిల్ అక్కినేని శ్రియా భూపాల్ తో ఎంగేజ్ మెంట్ ప్రారంభించి కొంతకాలం గడిచిన తర్వాత విరమించుకున్నాడు. నాగార్జున సమీప బంధువు సుమంత్ అక్కినేని కీర్తిరెడ్డిని పెళ్లి చేసుకొని విడాకులు కూడా తీసుకున్నాడు. అక్కినేని కుటుంబానికి విడాకులు శాపంగా మారాయంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో వాపోతున్నారు.   

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles