Sunday, December 22, 2024

నాటు నాటుకు ఆస్కార్ అవార్డు

  • చరిత్ర సృష్టించిన తెలుగు చిత్రం ఆర్ఆర్ఆర్
  • రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, రామ్ చరణ్, జూ. ఎన్ టీ ఆర్ ల ఘనత
  • ఆస్కార్ గెలుగుకున్న రెండో భారతీయ చిత్రం

ఆర్ ఆర్ ఆర్ వెళ్ళింది, చూసింది, గెలిచింది. లాస్ ఎంజిలిస్ లో జరుగుతున్న 95వ అకాడెమీ అవార్డులలో ‘నాటు నాటు’ పాట అత్యుత్తమ సంగీతంలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్నది.  ఈ అవార్డును సంగీత దర్శకుడ కీరవాణి స్వీకరించారు. ‘హిట్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ ’ అంటూ ఇంగ్లీషులో పాట పాడారు కీరవాణి అవార్డు స్వీకరించిన సందర్భంలో. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్ టీ ఆర్ నటనలో పండిన ఈ పాటను అకాడెమీ అవార్డుల మహోత్సవానికి హాజరైనవారంతా ఆస్వాదించారు. లేడీ గాగా  ‘టాప్ గన్ ’ అనే సినిమా కోసం పాడిన ‘హోల్డ్ మై హాండ్ ఫ్రమ్ అనే పాట, బ్లాక్ పాంథర్ నుంచి వాండర్ ఫర్ ఎవర్, దిస్ ఈ ఏ లైఫ్ ఫ్రంమ్ ఎవరీథింగ్ ఎవరీవేర్ ఆల్ ఎట్ వన్స్, టెల్ ఇట్ లైక్ ఎ ఉమన్ నుంచి అప్లాజ్ అనే పాట నుంచి ‘నాటు నాటు’ పాట గట్టి పోటీ ఎదుర్కొన్నది.

ఎలిఫెంట్ విష్పరర్స్ సినిమా దర్శకురాలు భాను అతయా, సంగడీత దర్వకుడు ఏఆర్ రెహమాన్: ఇద్దరూ ఆస్కాద్ అవార్డు గ్రహీతలు.

ఒక భారతీయ చిత్రానికి ఆస్కార్ అవార్డు రావడం ఇది రెండో సారి. అత్యుత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా ‘ద ఎలిఫెంట్ విష్పరర్స్’  ఆస్కార్ అవార్డును గెలుచుకున్నది. ఆల్ దట్ బ్రీద్స్ అనే డాక్యుమెంటరీని కూడా ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు కోసం పోటీలో పెట్టారు. కానీ అవార్డు నావల్నీ అనే డాక్యుమెంటరీకి దక్కింది.

‘నాటు నాటు’ పాట ఆధిక్యం, విజయవిహారం ఇంతటితో పూర్తయింది. జనవరిలో ఉత్తమ ఒరిజినల్ పాటగా (భువనచంద్ర రాశారు) గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్నది. ఈ పాటను ఆస్కార్ అవార్డుల ప్రదానం సమయంలో రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ్ పాడగా లారెన్ గొట్టిలెబ్ , దీపికా పదుకొనే నాట్యం చేశారు. పెర్సిస్ కంభాటా, ప్రియాంకాచోప్డా వీరి నృత్యాన్నీ, పాటనూ పరిచయం చేశారు.

నాటు నాటు పాటకు నృత్యం చేస్తున్న రామ్ చరణ్, జూనియర్ ఎన్ టీఆర్.

లోగడ కాస్ట్యూమ్స్ డిజైనర్ భానూ అతయాకూ, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మీన్ కూ, సౌండ్ ఇంజనీర్ రెసూల్ పూకుట్టీకీ, గౌరవ అవార్డు స్వీకరించిన గొప్ప దర్శకుడు సత్యజిత్ రేకీ ఆస్కార్ అవార్డులు దక్కాయి. వీరి జాబితాలో సంగీత దర్శకుడుగా ఎంఎం కీరవాణి, పాట రచయితగా చంద్రబోస్ చేరిపోయారు. ఆస్కార్ అవార్డు గెలిచిన మొదటి భారతీయ పాట ‘నాటు నాటు,’ తొలి భారతీయ చిత్రం ఆర్ఆర్ఆర్.

ఆస్కార్ అవార్డుల ప్రదానం సందర్భంగా కీరవాణి,చంద్రబోస్, విదేశీ నిర్వాహకుడు

బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు ఇండియాలోని ఇద్దరు యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ల నేపథ్యాన్ని తీసుకొని, కథను మార్చి తీసిన సినిమా ఆర్ఆర్ఆర్. ‘నాటు నాటు’ పాటను ప్రదర్శించినప్పుడు లాస్ ఎంజిలిస్ సినిమా హాలులో ప్రేక్షకులు సీట్లలో నుంచి లేచి నృత్యం చేశారు. ఉక్రెయిన్ లో యుద్ధం ప్రారంభం కావడానికి ముందు రాజధాని కీవ్ లోని అధ్యక్ష భవనం ఎదుట చిత్రించిన ఈ పాట భీమ్, సీతారామరాజు పాత్రలో నటించిన జూనియర్ ఎన్ టీ ఆర్, రామ్ చరణ్ బ్రిటిష్ పాలకులను ధిక్కరిస్తూ చేసిన డాన్స్ సందర్భంగా పాడింది. మొన్న పిడుగురాళ్ళలో ఒక విద్యాసంస్థలో జరిగిన సభలో చంద్రబోస్ తన పాట పాడి సభికులకు వినిపించారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే, ఈ ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపింది. శభాష్ ఇండియా. శభాష్ తెలుగు చలనచిత్ర పరిశ్రమ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles