Thursday, November 21, 2024

చీకటి రాత్రులు – వేకువ వెలుగులు

 (నేను రాసిన తొలి అక్షరాల జాడలు)

ఎన్ని చెప్పండి, దాటొచ్చిన కాలం నాటిన గుర్తులు, జ్ఞాపకాల దొంతరలో నుండి అంత త్వరగా తుడిచిపెట్టుకు పోవు. తప్పటడుగులే కానివ్వండి, తప్పులే చేయనివ్వండి. కానీ, ఒకనాడు తగిలిన గాయాల చారికలు గతాన్ని అనుకున్నంత త్వరగా వీడవు. నిత్యం నన్ను నేను నిర్మించుకోవడం కోసం అంతరాత్మని దహించుకున్న ఎన్నో నిద్రలేని రాత్రుల సాక్షిగా, అన్వేషించిన వేకువ వెలుగులు అనేకంగా అభివ్యక్తమయి కాని సమసిపోవు!

Also read: అభివృద్ధి – ఆదివాసులు – హింస

ఇవన్నీ నా తొలిరోజుల అక్షరాలు, సంఘర్షణలో నుంచి పుట్టిన పుస్తకాలు. కడుపు చేతపట్టుకుని ఉద్యోగం పేరిట ఏదో పనిని వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ ఎంతో కాలం ఇమడలేక తిరిగొచ్చిన  సందర్భాలు ఎన్నో వీటిని చూస్తుంటే ఇప్పుడు గుర్తు కొస్తున్నాయి. అరాజకత్వ అధ్యయన కేంద్రం (Center For Anarchist Studies) పేరిట ప్రజా ప్రచురణలు, శ్రమైక్య ప్రచురణలు పెట్టి ఈ అరడజను పుస్తకాల్ని ప్రచురించి పంచే నాటికి నిజానికి నాకో నిర్దిష్టమైన నిర్మాణాత్మకత లేదు!

Also read: ‘మతాతీత మానవత్వమే మన మార్గం’

1. ప్రజాస్వామ్య పతనం

(Decline Of Democracy)

2. అరాజకత్వం అంటే ఏమిటి?

(What is Anarchism?)

3. సాంఘిక తత్వం – వైప్లవ మార్గం

(Social Philosophy: Revolutionary Way)

4. ప్రజాస్వామ్య ప్రస్థానం

(The Journey Of Democracy)

5. ఒక నాస్తికుడి నామా

(Testament of Atheism)

6. అస్థిత్వం – అరాజకత్వం

(Existence – Anarchism)

అన్నీ 2010 – 12 లో ప్రచురించినవే. వీటిల్లో మూడింటికి రాసిన ముందుమాటల్లో కర్నాటక లోని బెంగుళూరు, ఉత్తరా ఖండ్ లోని శ్రీనగర్,అస్సాం గౌహతి లో ఉంటూ రాసినట్టుంది. ప్రచురణ పిఠాపురం నుంచే. తర్వాత కాలంలో ఎన్ని విధాలా ప్రజా సంఘాల పక్షిగా తిరిగినా, జనాందోళనల జలపాతాల్లో ఒదిగినా, ఎన్ని భిన్న అభిప్రాయాలతో వివిధ సంకలనాలు, గ్రంథాలని ప్రచురించినా మన  ఆరంభ అక్షరాల్లోకి ఆవాహన కావడముంది చూసారూ, ఆ అనుభూతి తీరే వేరు!

Also read: ఒకానొక ప్రస్థానం గురించిన ప్రస్తావన

వీటిలో దేనికీ సాఫ్ట్ కాపీ లేదు. హార్డ్ కాపీలు కూడా కొన్నుంటాయంతే. అప్పట్లో ఏయే సందర్భాలలో వీటి పరిచయం జరిగిందో నిజంగానే గుర్తులేదు. ఎన్నో జ్ఞాపకం పెట్టుకునే మనసుకి సొంత అక్షరాలంటే ఎంతలుసో అని ఆశ్చర్యం కలుగుతుంది. పాత పుస్తకాల్లో దొరికిన ఈ పాత జ్ఞాపకాల్ని మళ్ళీ ఇలా ఒకసారి ప్రేమగా గుర్తు చేసుకోవడం, జీవిత రచనలోకి కొత్తదనాన్ని ఆహ్వానించడంలో భాగమనే నా భావం!

Also read: కొన్ని తరాలు – కొన్ని స్వరాలు

(పదేళ్ళ క్రితం అచ్చేసిన ఈ అక్షరాల్ని ఇప్పుడు అనుకోకుండా ఇలా పరామర్శించాల్సి వచ్చింది. వీటి కారణంగా దగ్గరైన మిత్రులు, దూరం కాబడ్డ అమిత్రులకూ కొదవలేదు. ముఖ్యంగా, భావోద్యమాల్లో నాకంటూ ఒక స్థానం కల్పించినవి ఈ ఆరంభాక్షరాలే. ఈరోజు వీటితో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చుకానీ, still I Love these works. చదూతూంటే ఈనాటికీ అక్షరాల్లో ఆవేశం చల్లారలేదని అనిపిస్తుంది. అందుకే, వీటికోసం ఈ చిన్న రైటప్.)

Also read: గదర్ పార్టీ వీరుడు దర్శి చెంచయ్య, పిరికితనం ఆయన రక్తంలోనే లేదు!

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles