తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సమర్థించాలని ఎంఐఎంకు ఢిల్లీ ముస్లిం నేతల హుకుo జారీ చేశారు. ముస్లింల మనుగడకు జాతీయ పార్టీ కాంగ్రెస్ అవసరం అంటున్న వాదనను వారు ముందుకు తెచ్చారు. ప్రాంతీయ పార్టీలతో దేశం లోని ముస్లీమ్లకు మేలు జరగదని నిర్థారించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏంఐఎం పోటీ చేసున్న అసెంబ్లీ స్థానాలకు మాత్రమే మద్దతు అని తెలంగాణ ముస్లింలు స్పష్టం చేస్తున్నారు. బీజేపీతో ఎంఐమ్ లోపాయికారి ఒప్పందాలను సహించబోమని ఖండితంగా చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఎంఐమ్ బీజేపీ లోపాయిక ఒపందాలు బహిర్గతమైనాయని ఢిల్లీ ముస్లిం నేతలు చెప్పారు.
తెలంగాణ ఎన్నికల్లో ఎంఐమ్, బీజేపీలు రాజకీయ తప్పిదాలు చేస్తున్నాయని ముస్లిం నేతలు అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నామినేషన్లు ఘట్టం చివరి దశకు చేరుకుంటున్నసమయంలో ఎన్నికల ప్రచార హోరకు పార్టీలు సిద్దమవుతున్నాయి.
ఎన్నికల ప్రచారంకు జాతీయ పార్టీల అధినేతలు పాల్గొన్న డానికి తమ పర్యటన లకు సిద్ధం అవుతున్నారు. బీఆర్ ఎస్ తో ఎంఐఎం రాజకీయ ఒప్పందాలను తెలంగాణ ముస్లీలు అంగీకరించబోరని జాతీయ ముస్లిం నేతలు స్పష్టం చేశారు. గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎం ఐ ఎం పోటీ చేస్తానంటూ బీజేపీకి ప్రతిపదాన చేస్తే అందుకు బీజేపీ తిరస్కరించదంతో
ఎం ఐ ఎం వెనక్కి తిగిందని ఢిల్లీ ముస్లిం నేతలు గుర్తు చేస్తున్నారు
Also read: చంద్రబాబు నాయుడిపై మరో కేసు