మంచిర్యాల జిల్లా లోని బొగ్గు గనుల ప్రాంతం మందమర్రి పట్టణంలోని మార్కెట్ లో ప్రవేశించగానే లెఫ్ట్ ఎంటరెన్సు లో మంగలి లింగయ్య హెయిర్ సెలూన్ వస్తుంది. పట్టణం లో ఆయనను ఎరగని వారు ఉండరంటే అతి శయోక్తి కాదు. పట్టణంలో భూస్వాముల గుండాల దాష్టికాలకు.. గని కార్మికుల సమస్యలు పై జరిగిన ఎన్నో పోరాటాలకు లింగన్న ఒకప్పుడు సాక్షి.. లింగయ్య మేస్త్రి అలియాస్ సూత్రాల లింగయ్య ఎందరో స్థానికులైన మాజీ ఎమ్మెల్యే లు సంజీవరావు, బొడజనార్దన్, నల్లాల ఓదెలు, సింగరేణి అధికారులు, ప్రభుత్వ అధికారులు.. నా లాంటి జర్నలిస్టులు అందరికి కట్టింగ్లు గడ్డాలు చేసినవాడే.
Also Read : రెండు నెలల్లో గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిద్ధం
లింగన్న షాపుకు అన్ని దిన పత్రికలూ, పుస్తకాలూ వచ్చేవి. అమ్మకానికి కూడా పెట్టేవారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన షాప్ ఒక లైబ్రరీ లా ఉండేది. పట్టణంలో ని క్రీడా కారులకు కూడా కేంద్రం అదే.. మడక రాయలింగన్న.. బాదే ఎల్లన్న.. దుర్గన్న.. పోషన్న.. బానన్న..గట్టన్న.. రాజన్న.. బాబులాల్ అన్న లాంటి మా సీనియర్లు.. మార్టిన్ ప్రకాష్.. కనకయ్య.. యాదిరెడ్డి.. అంకుస్..బాణయ్య..ఉండేటి స్వామి.. శేఖర్.. రాజన్న.. రాజమోహన్ లాంటి మిత్రులము ఇదే లింగన్న షాప్ వద్ద కలిసే వాళ్ళం.
Also Read : సెప్టెంబర్ కల్లా 300 మెగావాట్ల సింగరేణి సోలార్ సిద్ధం..
ఆయన జగమెరిగిన నాయీబ్రాహ్మణుడు.. అన్ని రకాల ఉద్యమకారులకు చివరికి తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన పాత్ర పోషించారు… పోలీస్ లు ఉద్యమకారుల కోసం తన షాప్ వైపు వచ్చి వాకబు చేసినా విషయాన్ని ఆయన ఎదో ఒక పద్దతిలో తెలియజేసేవారు.. నా లాంటి వారిపై ఆయనకు ప్రత్యేక ప్రేమ ఉండేది.. ఆనారోగ్యంతో ఉన్నా షాప్ ముందు కూర్చుని తమ పిల్లలు కట్టింగ్లు గడ్డాలు చేస్తుంటే చూస్తూ ఎవరైనా పాతోళ్ళు కనిపిస్తే మాట్లాడే వారు.. రాజకీయాలు స్థానిక పరిస్థితులు.. పట్టణ అభివృద్ధి.. చాలా విషయాలపై ఆయన చర్చించే వారు.. ఎన్నికల్లో ఓటర్ల నాడి గురించి కూడ ఆయన నాయకులతో చర్చించే వారు.
Also Read : బంగారం కేసును చేధించిన రామగుండం పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు..
ఆయన చాలా మందికి కేరాఫ్ అడ్రస్ గా ఉండే వారు.. ఒక రకంగా ఆయనను పట్టణ శ్రేయోభిలాషి గా భవించావచ్చు. అలాంటి లింగయ్య ను ప్రతి ఒక్కరు గౌరవంగా లింగయ్య మేస్త్రి అని పిలిచే వారు.. దాదాపు అన్ని రాజకీయ పార్టీ కార్యకర్తలు నాయకులు… యూనియన్ నాయకులకు లింగయ్య మేస్త్రి తో మంచి అనుబంధం ఉండేది. ఆయన మరణించిన విషయం అరగంట లోపల కాంగ్రెస్ పార్టీ యువ నేత ఖాజా మొయినుద్దీన్ తెలిపాడు. ఆదివారం మందమర్రి లో తీవ్ర అనారోగ్యం తో తన 75 ఏట మరణించారు…. లింగన్న అమర్ రహే……లింగన్న లాంటి ప్రజాఉద్యమ శ్రేయోభిలాషులు బొగ్గు గనులు విస్తరించి ఉన్న ఆరు జిల్లాల్లో చాలామంది ఉండేవారు.. అలాంటి వారిలో లింగన్న ఒకరు.
Also Read : తెలంగాణ బాగుపడాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి: సోయం బాబూరావు