హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ పడిన 1122 మంది అభ్యర్థుల్లో 800 మందికి పైగా అభ్యర్థులు ధరావతు కోల్పోయారు. వీరిలో ప్రధాన పక్షాలు టీఆర్ఎస్, బీజేపీకి చెందిన వారూ ఉన్నారు. టీఆర్ఎస్ 30కి పైగా డివిజన్లలో ధరావతు కోల్పోయింది. వాటిలో అత్యధికం పాతనగరం పరిధిలోనివే. 2016 ఎన్నికల్లో అక్కడ ఎంఐఎం అత్యధిక స్థానాలు గెలుచుకోగా టీఆర్ఎస్ రెండవ స్థానంలో నిలిచింది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ రెండవ స్థానాన్ని ఆక్రమించి,కారు
ను పక్కన పెట్టింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బదిలీ అయిన టీడీపి, బీజేపీ ఓట్లలోకమలం
తన వాటాను తిరిగి తెచ్చుకున్నట్లయిందని విశ్లేషకులు అంటున్నారు.
Also Read:గ్రేటర్ లో ప్రముఖుల బంధువులకు తప్పని పరాజయం
బీజేపీ కూడా 20 డివిజన్లకు పైగా ధరావతు దక్కించుకోలేకపోయింది. టీఆర్ఎస్, బీజేపీ ఓట్లను ఎంఐఎం కొల్లగొట్టింది. ఈ ఎన్నికల్లో దారుణంగా దెబ్బ తిన్న కాంగ్రెస్ తాను పోటీ పడిన 146 వార్డుల్లో 130 చోట్ల ధరావతు కూడా దక్కించుకోలేకపోయింది. నగరంలోని ఇతర ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఎంఐఎంది కూడా అదే పరిస్థితి. అలాగే ధరావతు ఫొగొట్టుకున్నవారిలో అత్యధికులు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ఉభయ వామపక్షాలు, టీడీపీ, టీజేఎస్, ఇతర గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు ఈ జాబితాలో ఉన్నారు.
Also Read:`మేయర్` పీఠానికి ఐదుగురు వనితల పోటీ
ధరావతు వాపస్ ఎలా?
ఓడిపోయిన అభ్యర్థులు నిర్ణీత సంఖ్యలో ఓట్లు పొందితే ధరావతు తిరిగి పొందే వీలుంటుంది. ఈ ఎన్నికల్లో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 5 వేల రూపాయలు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 2,500 రూపాయల చొప్పున ధరావతు చెల్లించారు. మొత్తం పోలైన ఓట్లలో ఆరో వంతు లేదా 16.7 శాతం ఓట్లు పొందగలిగితే ధరావతు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.
Also Read:జీహెచ్ ఎంసీ ఎన్నికలు : విజేతలూ, పరాజితులూ నేర్చుకోవలసిన గుణపాఠాలు