Monday, December 23, 2024

+92, +1, +968, +44 నుంచి ఫోన్‌ వస్తే అంతే..

  • లిఫ్ట్‌ చేశారో సమస్తం గల్లంతు
  • నంబర్‌ సిరీ్‌స్ లను ప్రకటించిన పోలీసులు, టెలీకాం సంస్థ

హైదరాబాద్ : స్నేహితుడో, స్నేహితురాలి ఫొటోతోనో ఫోన్‌ వచ్చిందని, నంబర్‌ చూడకుండా ఫోన్‌ ఎత్తారో మీ సమస్త సమాచారం గల్లంతవుతుందని హెచ్చరిస్తున్నారు టెలీకాం ప్రతినిధులు, సైబరాబాద్‌ పోలీసులు. ఈ మేరకు ఓ వీడియోను రూపొందించి, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌. రోజు రోజుకూ సైబర్‌ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త ఎత్తుగడలతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న కేటుగాళ్లు లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఈ నేపథ్యంలో సరికొత్త సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నట్లు టెలీకాం, సైబర్‌ క్రైం పోలీసులు గుర్తించారు. కొన్ని సిరీ్‌స్ లతో కూడిన నంబర్‌లతో ఫోన్లు చేసి ప్రజలను బురిడీకొట్టిస్తున్నారు. ప్రజలు నంబర్‌లు గుర్తించకుండా వారి స్నేహితుల ఫొటోలతో ఆ నంబర్‌లు సేవ్‌ చేస్తున్నారు.

సమాచారం గల్లంతు..

 +92, +1, +968, +44 నంబర్‌ సిరీ్‌సలతో ఎక్కువగా నేరగాళ్లు సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సోషల్‌ మీడియాలో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వంటి ఖాతాలపై కన్నేసిన నేరగాళ్లు కొంతమందిని లక్ష్యం గా చేసుకుంటున్నారు. వారి ఫ్రెండ్స్‌ లిస్టులోంచి కొన్ని ఫొటోలను సేకరిస్తారు. ఆ తర్వాత మోసపూరిత నంబర్‌లను ఆయా వ్యక్తుల ఫొటోలతో సేవ్‌ చేస్తారు. ఆ ఫేస్‌బుక్‌ ఖాతా ఉన్న వ్యక్తికి ఫోన్‌ చేస్తారు. స్నేహితుడు, స్నేహితురాలి ఫొటోతో ఫోన్‌ రావడంతో సదరు వ్యక్తి నంబర్‌ చూడకుండానే ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తారు.

అత్యాధునికి టెక్నాలజీతో మోసం

అలా చేయగానే అతని ఫోన్‌లోని సమస్త సమాచారం సైబర్‌ నేరగాళ్లకు చేరిపోతుంది. అలా అత్యాధునిక టెక్నాలజీతో మోసపూరిత ఫోన్‌లు, వాట్సాప్‌ ఫోన్‌లు చేస్తున్నారని సైబర్‌ క్రైం పోలీసులు, టెలీకాం సంస్థల ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ఫోన్‌, వాట్సాప్‌ కాల్‌ లిఫ్ట్‌ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండి, ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకోవాలని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పేర్కొన్నారు. 

నోరు మూసుకోండి.. అంతర్జాతీయ నేరాలకు అడ్డుకట్ట కోసం.. ముహ్‌ బంద్‌ రఖో కార్యక్రమం

అంతర్జాతీయ స్థాయి సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి, సైబర్‌ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి బ్యాంకు అధికారులు ముందుకు వచ్చారు. ఇంటర్నేషనల్‌ అవేర్‌నెస్‌ వీక్‌-2020లో భాగంగా ‘మూహ్‌ బంద్‌ రఖో’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా  సైబర్‌ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు ఆధ్వర్యంలో ‘మూహ్‌ బంద్‌ రఖో’ (మౌత్‌ షట్) పోస్టర్‌ను రూపొందించారు. ఈ పోస్టర్‌ను సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సీపీ సజ్జనార్‌ ఆవిష్కరించారు. రాబోయే నాలుగు నెలల్లో వెయ్యికి పైగా వర్క్ షాపులు నిర్వహించనున్నట్లు బ్యాంకు ప్రతినిధులు ఈ సందర్భంగా తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles