Sunday, December 22, 2024

రాఫెల్ మించిన బొగ్గు కుంభకోణం సూత్రధారి కేసీఆర్ : రేవంత్ సంచలన వ్యాఖ్యలు

  • ఒరిస్సా నైని బొగ్గు గని కుంభకోణంపై మేము అన్ని విచారణ సంస్థలకు ఫిర్యాదు చేశాం
  • కేసీఆర్ ను జైల్లో పెడతాం అన్న బీజేపీ నేతల మాటలు ఏమయ్యాయి?
  • మోడీ, కేసీఆర్ ల కుమ్మక్కుతో 50 వేల కోట్లు దోచుకుంటున్నారు
  • నిబంధనలకు విరుద్ధంగా 8 ఏళ్లుగా సింగరేణి ఎం.డీ గా శ్రీధర్ కొనసాగుతున్నారు
  • మోదీని మూడోసారి ప్రధాని చేయడానికే కేసీఆర్ పొర్లు దండాలు చేస్తున్నారు.
  • కేసీఆర్ ను జైల్లో వేయకుండా ఉండాలనే మోడీతో కేసీఆర్ రహస్య ఒప్పందం.
  • యూపిఏ భాగస్వామ్య పక్షాలను చీల్చడానికే కేసీఆర్ మోదీ దగ్గర సుపారి తీసుకున్నారు.

ఒరిస్సా పోనీ నైని బొగ్గు గనుల కేటాయింపు రాఫెల్ కుంభకోణం కంటే పెద్ద కుంభకోణమని మోడీ, కేసీఆర్ కుమ్మక్కుతో 50 వేల కోట్లు పంచుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విమర్శించారు. సోమవారం నాడు గాంధీభవన్లో ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఈ మధ్య కేంద్రంపై, బిజెపిపై యుద్ధం ప్రకటించానని అంటున్నారని, రాఫెల్ నుండి మొదలుకొని కేంద్ర మంత్రుల అవినీతి అక్రమాలపైన సమస్త ఆధారాలు వున్నాయని అంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల సమయంలో, మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన బిజెపి జాతీయ నేతలు కేసీఆర్ అవినీతిపై మాట్లాడారు, కేసీఆర్ కుటుంబం జైల్లో ఉంటది అన్నారనీ, వీరిద్దరూ ఒకరిపై మరొకరు ఆరోపించుకున్నారనీ, టిఆర్ ఎస్, బిజెపి ల మధ్య విభేదాలున్నాయి అనీ జనాలకు చెప్పేలా చేశారని ఆయన అన్నారు. నిన్న ముంబై పర్యటన ఓ డ్రామా.. ఉప్పు, నిప్పు లా ఉన్నట్లు చూపించే పని చేశారని అన్నారు. కానీ నైని బొగ్గులో మోడీ, కేసీఆర్ లు వారి అనుయాయులకు బొగ్గు గనులు ఇచ్చి కలిసి దోచుకుంటున్నారని అన్నారు. సింగరేణి సంస్థ లో 51 శాతం రాష్ట్ర వాటా, 49 శాతం కేంద్రం వాటా వుంది.. 50 వేల మంది గని కార్మికులకు ఉద్యోగులకు అండగా ఉంటుంది, కరెంట్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. అలాంటి సింగరేణి గనులను ప్రైవేట్ సంస్థలకు కేంద్రం అమ్మడానికి ముందుకొస్తే.. రాష్ట్ర సర్కార్ అడ్డుకోడానికి ఎందుకు ముందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు.. అత్యంత నాణ్యమైన బొగ్గు మన వద్ద వుంది, సాంకేతిక అవసరం లేకుండా బొగ్గు తీయవచ్చు. కానీ అలాంటి బొగ్గును సింగరేణికి కాకుండా ప్రైవేట్ సంస్థలకు 25 ఏళ్ళు లీజ్ ఇవ్వడానికి కేసీఆర్ తన అధికారాన్ని వినియోగించి ప్రైవేట్ పరం చేసే కుట్ర చేశారని అన్నారు. సింగరేణి సంస్థకు సీఎండిగా శ్రీధర్ 8 ఏళ్లుగా కొనసాగుతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి వందల మంది ఐఏఎస్ అధికారులు ఉండగా శ్రీధర్ నే ఎందుకు కొనసాగిస్తున్నారు. శ్రీధర్ ను తొలగించాలని కోల్ ఇండియా అధికారాలు సమావేశంలో నిలదీసినా ఎందుకు తొలగించలేదు అని ప్రశ్నించారు. వేలాది కోట్ల రూపాయల అవినీతికి జరుగుతోంది. కేసీఆర్, ఐఏఎస్ శ్రీధర్ అక్రమాలకు పాల్పడుతున్నారనీ, శ్రీధర్ పై ఎన్నో ఆరోపణలు వచ్చిన కేసీఆర్ ఎందుకు తొలగించలేదనీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఒరిస్సా లోని నైని కోల్ మైన్ 25 ఏళ్లు ప్రైవేట్ సంస్థకు లీజ్ ఇచ్చారు. కోల్ ఇండియా నిబంధనలను కాలరాసి ఒకరిద్దరి వ్యక్తులకు లబ్ది చేకూరే పని చేసిండని అన్నారు. టెండర్ ఎవరికీ రాకుండా చేసే కుట్ర చేశారనీ, రాఫెల్ కుంభకోణం కంటే పెద్ద అవినీతి అనీ ఆయన అన్నారు . రాఫెల్ 35 వేల కోట్లు ఐతే.. ఇది 50 వేల కోట్ల కుంభకోణం అని అన్నారు. ‘‘ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో కలిసి దీనిపై కేంద్రానికి ప్రధానికి, హోమ్ , విజిలెన్స్ , కోల్ మినిస్టర్, కోల్ సెక్రెటరీ వరకు ఫిర్యాదు చేశాము, అన్ని విచారణ సంస్థల గడప తొక్కాము, ప్రతి తలుపు తట్టాము.. ఈ విషయంలో డీఓపీటీలో శ్రీధర్ పై ఫిర్యాదు చేశామని వివరించారు. ఇంత పెద్ద టెండర్ ని ఎవరికీ దక్కకుండా చేస్తున్నారు. టైలర్ మెయిడ్ కండిషన్ పై ముగ్గురి టెండర్లు వేసేలా కుట్ర పూరితంగా చేశారు’’ అని అన్నారు. ఈ విషయంలో తాముకేంద్ర మైనింగ్ మినిస్టర్ ప్రహ్లద్ జోషిని కలిసి ఫిర్యాదు చేస్తే తెలంగాణ సీఎం విషయంలో ఏమి చేయలేమని అన్నారని, అంతా పీఎంవో కార్యాలయం చూస్తుందని చెప్పారని అన్నారు.. సెంట్రల్ విజిలెన్సు కమిషన్ కు రిఫర్ చేయండి అని అడిగినా కూడా ప్రహ్లాద్ చేతులెత్తేశారని ఆరోపించారు. బొగ్గు తవ్వకాల్లో డీజిల్ కొనుగోలులో సీఎస్ఆర్ నిధుల వినియోగం పై విచారణ చేపట్టాలి. అప్పుడే సింగరేణి శ్రీధర్ అవినీతి బయటపడుతుందని, మోదీని మూడో సారి ప్రధానిని చేస్తే కేసీఆర్ జైలుకు వెళ్లకుండా ఉంటాడని ఆయన జోస్యం చెప్పారు. కేంద్ర సర్కార్.. బిజెపి సీఎం లకు ఈడీ నోటీసులు ఇచ్చిందని కానీ కేసీఆర్ అవినీతిపై ఏనాడూ మాట్లాడలేదని అన్నారు. కేసీఆర్ ను కాపాడడానికే ఈఎస్ ఐ సహారా కుంభకోణం కూడా తొక్కి పెట్టింది కేంద్రమేనని, నైని కోల్ కుంభకోణాన్ని ఆపడానికి న్యాయస్థానం కూడా ఆశ్రయిస్తామని అన్నారు.

సుపారీ గ్యాంగ్ లీడర్ కేసీఆర్

బిజెపిని ఎదురు లేని శక్తిగా మారడానికి కాంగ్రెస్ పార్టీ అనుబంధ పార్టీలను కేసీఆర్ దెబ్బతిస్తూన్నారు. బిజెపి వ్యతిరేకిస్తూన్నా పార్టీను కలవకుండా  ఉంటడమే అందుకు నిదర్శం  అన్నారు. కేసీఆర్.. జగన్, కేజ్రీవాల్, ఇతర నేతలను ఎందుకు కలవడం లేదని ప్రశ్నించారు. అందుకే కేసీఆర్.. చీటర్, లయర్ అండ్ లూటర్ అన్నారు.  మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధిపై, ఇరిగేషన్ ప్రాజెక్టుల పై  మాట్లాడుకున్నాం అని శరద్ పవర్, సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఎంపీ సుప్రియ సూలే.. నిన్నటి కలయికను వివరిస్తూ ట్వీట్ చేశారు, కానీ కేసీఆర్ అండ్ కల్వకుంట్ల కుటుంబ సభ్యులు.. వేరే రకంగా ప్రచారం చేస్తున్నారని అన్నారని దుయ్యపట్టారు.

జగ్గారెడ్డి పై రేవంత్ రెడ్డి

జగ్గారెడ్డి ఇష్యూ పార్టీ  దృష్టికి వచ్చిందన్నారు. పార్టీ పెద్దలు జగ్గారెడ్డితో మాట్లాడుతున్నారని చేప్పారు. జగ్గారెడ్డి మా నాయకుడు, అయన మా అధిష్టానం అపాయింట్ మెంట్ కోరాడని చేప్పారు. జగ్గారెడ్డికి మేమంతా అండగా ఉంటామన్నారు. గతంలో విహెచ్ పై కూడా ఇలాగే సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని ఇప్పడు కూడ జగ్గారెడ్డిపై ట్రోల్ చేస్తూన్నారని చేప్పారు. అప్పడు సైబర్ కేసు నమోదు చేస్తే  తీస్తే కౌశిక్ రెడ్డి అనుచరుడని తేలిందని గుర్తు చేశారు.   ఈ అంశం పై కూడ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తమని చేప్పారు. జగ్గారెడ్డి ఇష్యూ .. మా కుటుంబ సమస్య.. అందరం కూర్చొని మాట్లాడుకుంటామని చెప్పారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles