న్యూదిల్లీ : కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడుతున్నామని, అలా అని దానిపై పోరాడడంలో రాజీ పడకూడదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పాజిటివ్ కేసుల రేటు 5 శాతం మించకూడదని అన్నారు. కొందరి నిర్లక్ష్యం కూడా కరోనా వ్యాప్తికి కారణమని అన్నారు. కేసులు అధికంగా ఉన్న ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ సహా ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన ఈరోజు వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్షించారు. కోవిడ్ మందు పంపిణికి ప్రభుత్వం కార్యాచరణను రూపొందిం చిందని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమగ్ర నివేదికలు అందచేయాలని ఆయన సూచించారు.
లైఫ్ సర్టిఫికట్ గడువు పెంపు
కేంద్ర ప్రభుత్వ ఫించనర్లు జీవన ప్రమాన పత్రాలు (లైఫ్ సర్టిఫికెట్ లు) సమర్పణ గడువును వచ్చే ఫిబ్రవరి 28వ తేదీ వరకు పొడిగించారు. ఇప్పటికే ఈ గడువును నవంబర్ 1 వ తేదీ నుంచి వచ్చే నెల (డిసెంబర్) 31 వరకు పొడిగించారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఈ గడువును పెంచాలని వివిధ పింఛనర్ల సంఘాలతో పాటు వ్యక్తిగతంగా వచ్చిన వినతులు, కాగ్ వర్గాలతో సంప్రదించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.