- వ్యవసాయ చట్టాల పేరుతో రైతాంగానికి ఉరితాళ్లు
- రైతుల పోరాటంపై మోదీ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండకు నిరసనగా సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన
మంచిర్యాల : దేశాన్ని పరిపాలిస్తున్న బిజెపి మోడీ ప్రభుత్వం దేశ భక్తి పేరుతో జపం చేస్తూ దేశ సంపదను విదేశీ పెట్టుబడిదారులకు దారాదత్తం చేస్తున్నాయి. దీనిలో భాగంగానే భూములను, వ్యవసాయ రంగాన్ని మొత్తం ప్రయివేట్ బడా పెట్టుబడిదారుల చేతుల్లోకి తీసుకు వెళ్లడం కోసమే మూడు వ్యవసాయ చట్టాలను తీసుకురావడం జరిగింది. దీనివలన రైతులు తమ భూములను కోల్పోవడమే కాకుండా భవిష్యత్తులో తమ భూముల్లోనే కూలీలుగా మారే పరిస్థితి వస్తుంది. మరోపక్క నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతాయి.
రైతులు పండించే పంటలకు మద్దతు ధర, మార్కెట్ సౌకర్యం కల్పించే బాధ్యతల నుండి ప్రభుత్వం చేతులేత్తేస్తుంది. దీనివలన రైతాంగం ప్రజలు కాంట్రాక్టర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతికే స్థితిలోకి మోడీ ప్రభుత్వం నెట్టుతుంది. మరోపక్క విద్యుత్ రెగ్యులేషన్ చట్టం పేరుతో వ్యవసాయ మోటర్లకు, నివాసాలకు రిలయన్స్ సంస్థ తయారు చేసిన డిజిటల్ విద్యుత్ మీటర్లు పెట్టాలని నిర్ణయం చేసింది. ఇప్పడున్న గృహాల విద్యుత్ మీటర్లు తొలగించి కొత్త మీటర్ల పేరుతో ప్రజలపై భారం వేయబోతున్నారు.
‘రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ లేకుండా పోతుంది. ఫలితంగా రైతులు తమ భూములను వదిలేసుకుని కూలీలుగా మారే పరిస్థితులు మోడీ ప్రభుత్వం తీసుకు వస్తుంది. దీనికి నిరసనగా గత వారం రోజులుగా దేశ వ్యాప్తంగా రైతులు ఢిల్లీ నగరంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం అన్నం పెట్టే అన్నదాతలపై బాష్పవాయు ప్రయోగం, నీటి ఫిరంగులు, లాఠీలతో రైతు ఉద్యమంపై దాడి చేస్తోంది. ఇదేనా నరేంద్ర మోడీ బిజెపి ఆర్ ఎస్ ఎస్ దేశభక్తని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దేశభక్తి అంటే దేశాన్ని అమ్ముకోవడం కోసమే వాడుకుంటున్న పదముగా బిజెపి టిఆర్ఎస్ ప్రభుత్వం నిరూపించుకుంది. ఇట్లాంటి ప్రభుత్వం నుండి వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం కోసం దేశభక్తి యుతంగా పోరాటం చేస్తున్న రైతాంగానికి జేజేలు పలుకుతున్నాము. రైతు పోరాటాలు విజయం సాధిస్తారని.ఆర్ఎస్ఎస్ బిజెపి మోడీ ప్రభుత్వానికి దేశ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు అన్నారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సంకె రవి. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బొంకురి గోవర్ధన్. సీఐటీయూ జిల్లాఉపాధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి, నాయకురాలు ఝాన్సీ,నిరంజన్ పాల్గొన్నారు