పాపం చాలా కష్టపడ్డాడు, చాలా మంది కలిసి చంపేసారు. అందరూ కలిసి చంపారు, ద్రోహులు, బంధువులు, ఆప్తబంధువులు, రక్త బంధువులు, రక్తం తీసుకున్న బంధులు, రాజకీయాలకోసం చంపారు. ఉన్నత అధికారులనుకునే వారు, తరువాత రాజకీయానికి చేరిన వారు, ఎంతో డబ్బున్న సంపన్నులు, కొందరు జర్నలిస్టులు, ఎంపీలు, ఎల్యేలు… మానవత్వం లేదు. ఎన్నడూ చట్టానికి దొరకని దొంగలు, నమస్కరిస్తూ కన్ను పొడిచారు. వెన్ను పొడిచారు. ఇవ్వాళ ఆయన వర్థంతి అంటారు. అది జయంతి కాదు. చనిపోయిన రోజు కాదు. చంపేసిన రోజు. వాళ్లంతా బ్రూటస్ లు.