(శ్రీలత)
ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎన్నికలు మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్. జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయకర్ రావు లకు అగ్నిపరీక్షగా నిలువనున్నాయి. ప్రస్తుత ఎమ్మేల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డే అభ్యర్ది అవుతాడని చెబుతున్నారు. మరో వైపు టిఆర్ఎస్ పార్టీ టీవీ చానల్లో ఇన్పుట్ ఎడిటర్ గా పని చేస్తున్న జర్నలిస్టు పివి శ్రీనివాస్ తాను ఎన్నికల బరిలో ఉంటున్నాను అంటూ ఖమ్మంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. దీన్ని అధికార పార్టీ నాయకులు కాదు లేదు అని ప్రకటించక పోవడం అనుమానాలు రేకెత్తిస్తున్నది.
పల్లా రాజేశ్వర్ రెడ్డి అభ్యర్దిత్వం ఖాయం చేస్తారా లేక మరోకరికి ఇస్తారా అన్న అనుమానాలు టిఆర్ఎస్ శ్రేణుల్లోనే ఉన్నాయి. పల్లా రాజేశ్వర్ రెడ్డి అభ్యర్దిత్వం అయితే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందనే భావన కార్యకర్తల్లో ఉన్నదని టీఆర్ఎస్ నాయకులే అంటున్నారు. పల్లా ఎమ్మేల్సీ గా విజయం సాధించిన తరువాత అందుబాటులో లేరనే విమర్శ ఉంది. కరోనా సమయంలో అన్ని వ్యవస్థలు కుప్పకూలిన సమయంలో పల్లా హైదరాబాద్ కే పరిమితమైనారనే భావన ప్రజల్లో ఉంది.
తెలంగాణ అన్ని జిల్లాలకు యూనివర్శిటి సదుపాయం ఉంది. ఖమ్మం జిల్లాలో ఉన్నత చదువులకు యూనివర్శిటి లేక పోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లే స్థోమత లేని విద్యార్దులు డిగ్రీలతోనే సరి పెట్టుకోవాల్సి వస్తుంది. రాష్ట్ర విభజన సమయంలో గిరిజన యూనివర్శటి ఏర్పాటు చేస్తామన్నారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు కానీ అమలు జరగలేదు.
ముఖ్యమంత్రికి సన్నిహితుడని పేరున్న పల్లా ఖమ్మం జిల్లాకు ప్రయోజనాలు చేకూర్చడానికి కృషి చేయవలసినంత చేయలేదనే అభిప్రాయం పట్టభద్దులలో ఉంది. ప్రభుత్వ పని తీరు కూడా ఆశా జనకంగా లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతున్న సమయంలో వచ్చిన ఈ పట్టభద్రుల ఎమ్మేల్సీ ఎన్నికలు ముగ్గురు మంత్రులకు అగ్నిపరీక్షలా మారింది. అధికార పార్టీ అభ్యర్థి విజయానికి ముగ్గురు మంత్రులూ ఎట్లా తోడ్పతారనే అంశంపైన ఆసక్తి నెలకొంది.
Useless Ministers.