Wednesday, December 25, 2024

సింగరేణిలో ఎంఎల్సీ ఎన్నికల లొల్లి

  • టీఆర్ఎస్, బీజేపీ బాహాబాహీ

మంచిర్యాల: సింగరేణిలో టిఆర్ఎస్.. బిజెపి వర్సెస్ లొల్లి మొదలయింది.. ఎమ్మెల్యేలు.. ఎంపీలు.. మంత్రులు.. బీజేపీ నేతల మధ్యన వాదోపవాదాలు.. ఆరోపణలూ, ప్రత్యారోపణలూ  ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో పెరిగి పోయాయి. సింగరేణి కేంద్రంగా రాజకీయాలు వేడివేడిగా సాగుతున్నాయి. బీజేపీకి చెందిన మాజీ ఎంపీ జి. వివేకానంద్ తన వంతు ప్రచారం శక్తివంచన లేకుండా చేస్తున్నారు. సింగరేణిలో  తెలంగాణ రాష్ట్ర సమితి తో పాటు ఆపార్టీ అనుబంధంగా ఉన్న టీబీజీకేఎస్ మీద బిజెపి చాలా సీరియస్ గా దృష్టి పెట్టింది. బిజెపి లో చేరికలను పెంచాలని నేతలు భావిస్తున్నారు.

బీజేపీ నేతల టార్గెట్ టిఆర్ ఎస్ గా కనిపిస్తోంది. ఇటీవల కాగజ్ నగర్ కు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు మిగిలిన నేతలు శ్రీరాంపూర్ లో అటు కాగజ్ నగర్ పైనా, సింగరేణి పైనా ఎక్కువ గురి పెట్టి మాట్లాడారు. కాంగ్రెస్ నేత పాల్వాయి హరీష్ రావు బిజెపి లో చేరినప్పటికీ బిజెపి కి కానీ హరీష్ కు కానీ పెద్ద ప్రయోజనం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడి ఎమ్మెల్యే కొనప్ప చరిష్మా అలాంటిది.. ప్రయోజనాలు ఆశించని ఆయన సేవలు అలాంటివి.. అయితే సింగరేణి విస్తరించి ఉన్న ఖమ్మం.. ఆదిలాబాద్.. వరంగల్.. కరీంనగర్ పాత జిల్లాల్లో గల 11 అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్ స్థానాల్లో బలం పెరగాలి.

Also Read : బీజేపీపై టీఆర్ఎస్ దళిత శాసనసభ్యుల ధ్వజం

అందుకే ఈ కసరత్తు… ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సీట్లు ఓట్లు మంచిగానే వచ్చినప్పటికీ  ఒక మంథిని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మినహా  మిగిలిన కాంగ్రెస్ కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు టిఆర్ ఎస్ లో చేరి పోయారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. 2017 యూనియన్ ఎన్నికల్లో టిబిజికెఎస్ విజయం సాధించింది. అదే గుర్తింపు పొందిన యూనియన్ గా కొనసాగుతోంది. వివిధ స్థాయి నేతల అవినీతి కార్యకలాపాల వల్ల యూనియన్ లోని కొందరు అగ్ర నేతలకు కార్మికులలో మంచి పేరు లేదు. అందుకు నాయకత్వం మార్పు పై కేటీఆర్, కవిత, మంత్రి కొప్పుల ఈశ్వర్ లు కసరత్తు మొదలు పెట్టారు. త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ ఎస్ అభ్యర్థికి భారీగా సింగరేణిలో ఉన్న పట్టభద్రులైన ఓటర్లలో   మైనస్ అయ్యే అవకాశాలు  లేకుండా గాయాలకు పట్టీ కట్టే పని చేస్తున్నారు.

అందుకే  పార్టీ కార్యక్రమాలలో  కూడా ఇటీవల కేటీఆర్ తీసుకున్న సభ్యత్వం డ్రైవ్ వల్ల కాస్త కదలిక కనిపిస్తుంది.  టిఆర్ఎస్ ఇతర రాజకీయ పార్టీల కన్నా సింగరేణిలో బలంగానే ఉంది. కేటీఆర్, కవిత ప్రభావం కూడా ఉంది. సీపీఐ, కాంగ్రెస్, సీపీఎం పార్టీ ల అనుబంధ ఏఐటీయూసీ, ఐఎన్టీయుసి లాంటి సంఘాల యాక్టివిటి సీఐటీయూ.. హెచ్ఎమ్మెస్ ల ప్రాబల్యం ఉన్నంతగా బీజేపీ కి ఉన్న బిఎమ్మెస్ కు బలం లేదు. ఇటీవల ఆ యూనియన్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య యూనియన్ కు రాజీనామా చేశారు. దీని వల్ల భారీ నష్టం బిఎమ్మెస్ కు జరిగిందని చెప్పవచ్చు. ఎలాగైనా ఈ ప్రాంతంలో బీజేపీ కార్మికుల సమస్యలు ఫోకస్ చేసి ప్రాబల్యాన్ని పెంచుకునే కార్యక్రమంలో భాగంగా సంస్థ లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయాలు.. సీఎండీ శ్రీధర్ పదవీకాలం కేంద్రం నో అన్నా  రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ ఆదేశాలు జారీ    చేసారంటూ…ఈ విషయాన్ని ఒక తురుపు ముక్కలా పట్టుకున్నారు.. ఇదే విషయాలను పదే పదే చెబుతూ భారీగా ప్రచారం చేస్తున్నారు.. మాస్ సపోర్ట్ మాత్రం కనిపించడం లేదు.

Also Read : ఉద్యమాల శ్రేయోభిలాషి లింగయ్య మేస్త్రి ఇక లేడు

టిఆరెస్ ఎమ్మెల్యే లను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రయోగించిన పదజాలం రానున్న యూనియన్ ఎన్నికల్లో సింగరేణి లో ప్రయోగించే పరిస్థితి కనిపిస్తోంది. ఒక వైపు బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేసి సంస్థకు కొత్త బ్లాక్ లు వేలంలో పాల్గొంటే తప్ప కేటాయించే పరిస్థితి పై ఒక్క మాట మాట్లాడని బిజెపి సింగరేణి ప్రాంతంలో రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం అవుతుందని భావించడం  ఎక్కువ ఆశపడ్డట్టే అవుతుంది అని.. కుల మతాలకు అతీతంగా జీవించే బొగ్గు గనుల ప్రాంతాల్లో మత, కులపరమైన  రాజకీయాలకు తావు లేదని అప్పుడే కమ్మునిస్టులు.. కాంగ్రెస్ నేతలు చెప్పడం మొదలు పెట్టారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న బిజెపి కోల్ బెల్ట్ లో ని కోకొల్లలు గా ఉన్న అడ్డంకులను తొలగించుకుంటు కార్మికుల్లో వారి కుటుంబాలకు నమ్మకాన్ని విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకుని ముందుకు వెళుతుందో వేచి చూడాల్సిందే. 

సింగరేణి లో 2017 లో జరిగిన యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో బిఎమ్మెస్ కు 300 ఓట్లు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో    బీజేపీ వ్యూహం కార్మిక క్షేత్రాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది మాత్రం అత్యంత ఆసక్తికరమైన విషయమే మరి. కోల్ బెల్ట్ లో బవిష్యత్తులో కేంద్రం వర్సెస్ స్టేట్,  బీజేపీ వర్సెస్ టిఆరెస్ లొల్లి హై పిచ్ లో కనిపించే వాతావరణం ఉంది. సింగరేణి అధికారులు   ఈ రెండు పార్టీల మధ్యన   నలిగి పోయే పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు.

Also Read : రెండు నెలల్లో గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిద్ధం

Muneer MD
Muneer MD
Special Correspondent from Mancherial

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles