- కాగజ్ నగర్ లో రైతు వేదికను ప్రారంభించిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
- వంజిరి రైతువేదిక ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, పురాణం సతీష్ కుమార్
రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా వ్యవసాయ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చి వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు. కాగజ్ నగర్ మండలంలోని చింతగూడ దుర్గా నగర్ వంజిరి జంబుగ గ్రామాల్లో రైతువేదిక భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి వాటిని అమలు చేస్తూ రైతును రాజులా చూస్తోందని కోనప్ప తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత సాగు నీటి వసతి, 24 గంటల విద్యుత్, రైతు బందు, రైతు బీమా లాంటి పథకాలను ప్రవేశపెట్టి రైతులను కంటికి రెప్పలా టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాపాడుతోందన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, ఎంపిపి వైస్ ఎంపిపి ఆయా గ్రామాల సర్పంచ్ లు ఎంపిటిసిలు పిఎసిఎస్ అధ్యక్షులు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు..
Also Read: సింగరేణి లో మాదే విజయం