చిత్రకూట్ సమాజ సేవక వ్యవస్థ నాయకుడు, సంత్ తులసీదాస్ పేరున నిర్మించిన తులసీ పీఠ్ వ్యవస్థాపకుడు పద్మభూషణ్ రామభద్రాచార్య (పండిట్ గిరిధర్ అని పేరున్నవారు) గొప్ప సంస్కృత పండితుడు, కవి, రచయిత, వ్యాఖ్యాత, కథ, ప్రవచన ప్రముఖుడు. చిత్రకూట్ లో వికలాంకుడైన విశ్వవిద్యాలయం శాశ్వత వైస్ చాన్సలర్ జగద్గురు రామభద్రాచార్య గారు.
హనుమాన్ చాలీసా లోని కొన్ని పదాలలో ఉన్న తప్పులు తెలుసుకుని ఉచ్ఛారణలో పదభ్రష్టాలను తెలుసుకొని, రామ చరిత్ మానస్ లోని హనుమాన్ చాలీసా లో కొన్ని లోపాలను రామభద్రాచార్య సవరించి కొత్త గ్రంధాన్ని ప్రధాన మంత్రి ఆవిష్కరిస్తారని ఆయన చెప్పారు.
Also read: జగన్నాథుడి సందేశం: అహంకారం భూమార్గాన్ని పట్టించండి
హనుమాన్ చాలీసా (లేదా (చౌపాయీ) పఠించే ప్రతి భారతీయులకు ఎదురయ్యే తీవ్రమైన లోపాలను తులసీ పీఠాధీశ్వర్ జగద్గురు రామభద్రాచార్య కనిపెట్టారు. స్వయంగా పరిశోధించి కొన్ని లోపాలను తెలుసుకుని హనుమాన్ చాలీసా 40 దోహా (పద్యా)లలో శుధ్ధి చేసి తప్పుడు శబ్దాలను సరిదిద్దినారని వివరించారు. (ఇది విని చూసి తెలుసుకోవచ్చు. https://www.youtube.com/watch?v=8Iw8xrdcguw)
హనుమాన్ చాలీసాలో సవరింపులు ఇవి:
ఒకటవ మార్పు
హనుమాన్ చాలీసా 40 దోహాలో (శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగ వందన) 6వ పద్యం అని ఉంది. ‘శంకర సువన్ కేసరి నందన్’ అని అంటున్నారు. శంకరుని కొడుకు అనడం పొరబాటు అంటారు జగద్గురు రామభద్రాచార్య గారు. (हनुमान चालीसा 6 वीं चौपाईजो कि गलत है. इसलिए ‘शंकर स्वयं केसरी नंदन’ बोला जाना चाहिए.)
శంకర స్వయం కేసరీ నందన్ ‘शंकर स्वयं केसरी नंदन’ శంకరుడు స్వయంగా కుమారుడు అంటే సరిపోతుంది. ఇందులోపెద్ద నేరమేమీ కాదు. కాని స్వయంగా అటువంటి సమానుడు అని చెప్పడం దీని అర్థం.
రెండో మార్పు
हनुमान चालीसा की 27वीं चौपाई बोली जा रही है- ‘सब पर राम तपस्वी राजा’, जो कि गलत है. హనుమాన్ చాలీసా 27వ దోహాలో ‘‘సబపర రామరాయసిర తాజా తినకే కాజ సకల తుమ సాజా’’ ‘सब पर राम तपस्वी राजा’, అని ‘‘సబ్ పర రామ తపస్వీ రాజా’’ అనడం సరి కాదు.
కాని ‘‘సబ పర్ రామ్ రాజ ఫిర్ తాజా…’’ ‘सब पर राम राज फिर ताजा’ ఇది సరైన మాట.
మూడో మార్పు
हनुमान चालीसा 32वीं चौपाई में ‘राम रसायन तुम्हारे पास आ सदा रहो रघुवर के दासा…’ यह नहीं होना चाहिए. హనుమాన్ చాలీసా 32 దోహాలో ‘‘రామ్ రసాయన్ తుమ్హరే పాస్ ఆ సదా రహో రఘువర్ కే దాసా’ అని అంటారు.
దీన్ని ‘‘సదా రహా రఘువర్ కే దాసా’’ ‘ जबकि बोला जाना चाहिए- ‘… सादर रहो रघुपति के दासा’., అంటూ ఈ విధంగా మార్చాలని ‘‘సాదర్ రహొ రఘుపతి దాసా’’రామభద్రాచార్య చెప్పారు. వ్యాకరణ నిపుణులైన ఆయన వివరిస్తున్నారు.
Also read: ‘‘నాతో అటాచ్ అయితే వదులుకోను’’ – సద్గురు శివానంద
నాలుగో మార్పు
హనుమాన్ చాలీసా 38వ దోహాలో ‘‘జో శతవార పాఠకర జోయీ చూతహి బంది మహసుఖహోయీ’’ లేదా ‘‘జొ సత్ బార్ పాఠ కర కోయీ ‘जो सत बार पाठ कर कोई…’ అంటూ ఉంటారు. हनुमान चालीसा 38वीं चौपाई में लिखा है- ‘जो सत बार पाठ कर कोई…’
కాని जबकि होना चाहिए- ‘‘’यह सत बार पाठ कर जोही… యహ్ సత్ బార్ పాఠ్ కర జోహీ’’ అనడం సరైన మాట అని నిర్ణయించారు.
జగద్గురు రామభద్రాచార్య గారు కనిపెట్టిన లోపాలు | జగద్గురు రామభద్రాచార్య చేసిన సవరణలు |
1. हनुमान चालीसा की एक चौपाई है-‘शंकर सुमन केसरी नंदन…’ उन्होंने बताया कि हनुमान को शंकर का पुत्र बोला जा रहा है, శంకర సువన్ కేసరి నందన్ ‘शंकर सुमन केसरी नंदन…’ | 1. जो कि गलत है. इसलिए ‘शंकर स्वयं केसरी नंदन’ बोला जाना चाहिए. శంకర స్వయం కేసరీ నందన్ ‘शंकर स्वयं केसरी नंदन‘ |
2. हनुमान चालीसा की 27वीं चौपाई बोली जा रही है- ‘सब पर राम तपस्वी राजा’, जो कि गलत है. సబ్ పర రామ తపస్వీ రాజా ‘सब पर राम तपस्वी राजा’ | 2. उन्होंने बताया कि तपस्वी राजा नहीं है… सही शब्द ‘सब पर राम राज फिर ताजा’ है సబ పర్ రామ్ రాజ ఫిర్ తాజా…’ ‘सब पर राम राज फिर ताजा‘ |
3. हनुमान चालीसा 32वीं चौपाई में ‘राम रसायन तुम्हारे पास आ सदा रहो रघुवर के दासा…’ यह नहीं होना चाहिए. సదా రహా రఘువర్ కే దాసా | 3. ‘ जबकि बोला जाना चाहिए- ‘… सादर रहो रघुपति के दासा‘., సాదర్ రహొ రఘుపతి దాసా |
4. हनुमान चालीसा 38वीं चौपाई में लिखा है- ‘जो सत बार पाठ कर कोई…’ ‘‘జొ సత్ బార్ పాఠ కర కోయీ | 4. जबकि होना चाहिए- ‘यह सत बार पाठ कर जोही…‘ యహ్ సత్ బార్ పాఠ్ కర జోహీ’’ |
మహా వ్యాకరణ వేదాంత శాస్త్రవేత్త
జగద్గురు రామభద్రాచార్య పుట్టిన వెంటనే జబ్బువల్ల, రెండు నెలల వయసు నుంచి గుడ్డివాడైపోయినారు. కాని ఆయన మహా పండితుడు కావడానికి ఆయన వికలాంకత్వం ఏ విధంగా అడ్డు కాలేదు. 17 ఏళ్ల దాకా సొంతంగా ఎక్కడా బడికి వెళ్లి చదువుకోలేదు. ఎప్పుడూ బ్రైలీ సహాయం తీసుకోలేదు. చిన్నప్పుడు ఆడుకుంటూ పరుగెత్తిపోతూ నీళ్లులేని బావిలో పడిపోయాడు. కొన్ని రోజుల తరువాత ఒక చిన్నమ్మాయి బతికించాడు. 1.192.4 నెంబర్ రామచరిత్ మానస్ దోహా తాత వినిపించి చెప్పడంతో మహారచయితగా మహాభక్తుడిగా మారిపోయాడు.
జగద్గురు రామభద్రాచార్య ఇప్పుడు కనీసం 22 పైగా అనేక భాషలను నేర్చుకున్నాడు. చెప్పగలడు. సంస్కృత, హిందీ, అవధీ, మైథిలీ వంటి అనేకానేక భాషలు తెలసిన వాడు. వందకన్న ఎక్కువ పుస్తకాలు రచించాడు. 50 పరిశోధనా పత్రాలు సమర్పించారు. నాలుగు పురాణ కావ్యాలను రచించారు. హిందీ భాషలో తులసీదాస్ రామ చరిత్ మానస్ పైన, హనుమాన్ చాలసీ పైన సంస్కృత భాషలో వివరణమైన వ్యాఖ్యానాలు రచించారు. అష్టాధ్యాయి, ప్రస్థాన త్రయి రచనాలపైన వ్యాఖ్యానాలు చేసారు. సంస్కృత వ్యాకరణాన్ని, న్యాయ వేదాంత శాస్త్రాలలో నిపుణుడు. తులసీదాస్ పై ప్రపంచంలో ప్రముఖ ఆచార్యుడు. రామ చరిత్ మానస్ పైన పరిశోధించి తార్కికమైన అద్భుతమైన వివరణ పుస్తకాన్ని ప్రచురించారు. రామాయణ, భగవద్గీత, భాగవతంలో అద్భుతంగా ప్రవచనం, కథగా శ్రావ్యంగా వినిపించగలిన వాడు.
1950 జనవరి 14న ఉత్తరప్రదేశ్ లో జాన్పూర్ జిల్లాలో జన్మించిన జగద్గురువు. కేవలం వినడం ద్వారా కవిత్వం చెప్పి రాయించే వాడు. తరువాత మాస్టర్ డిగ్రీ సాధించాడు. విద్యావారిధి అనే పేరుతో డాక్టరేట్ పొందారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఫెలోషిప్ ఇవ్వడం వల్ల సహాయం లభించింది. ‘‘ఆధ్యాత్మ రామాయణే పాణీనీయ ప్రయోగాణమ్ విమర్శాహ్’’ ఆధ్యాత్మ రామాయణ లో పాణీనికి కాక ఇతర ప్రయోగాల గురించి విశ్లేషించారు.
1981 సంవత్సరంలో కేవలం 13 రోజుల్లో ఈ ధీసిస్ ను రచన పూర్తి చేసారు. సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంలో వ్యాకరణ శాఖ అధ్యక్షుడిగా నియమించారు. కాని తిరస్కరించి, శేష జీవనాన్ని మతం, సమాజ ప్రజలకోసం వికలాంకుల మేలుకోసం అంకితం చేసారు. ఆ తరువాత పోస్ట్ సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంలో పాణీనీన సంస్కృత వ్యాకరణ రచనలలో రెండు వేల పేజీల ధీసెస్ ప్రమర్పించి డాక్టరేట్ వాచస్పతి పేరుతో డిఎల్ డిగ్రీని సంపాదించారు.
Also read: రామాయణ భాగవత భారతాల కొన్ని కథలే ఎన్టీఆర్ దృశ్య కావ్యాలు
జగద్గురు రామభద్రాచార్యరామ్ జన్మభూమి వివాదంలో 5వ దావాలో ముందు 2003లో 16వ దావావేసిన వ్యక్తిగా నిలబడ్డారు. తన అఫిడవిట్ లో వివరంగా రాసి, క్రాస్ పరీక్షలో ఎదుర్కొన్నారు. అలహాబాద్ హైకోర్టు ధర్మపీఠం తుది తీర్పులో రామభద్రాచార్య ఉటంకించారు. రామాయణం, రామ తాపనీయ ఉపనిషత్, స్కాంద పురాణం, యజుర్ వేదం, అథరన్ వేదాలను ఉటంకిస్తూ ఎక్కడెక్కడ అయోధ్యా పవిత్ర పట్టణం గురించి చెబుతూ రామచంద్రుడి పుట్టిన ప్రమాణాలను వివరించారు.
దోహా శతకం ద్వారా 8 శ్లోకాలను అర్ధాలు చెబుతూ ఏ విధంగా రాముని దేవాలయాలను 1528 సంవత్సరంలో మొఘల్ రాజు బాబర్ కూల్చి వేసారో వివరించారు. కవితావళి అనే గ్రంధంలో మసీదుకూల్చిన వివరాలున్నాయన్నారు. జన్మభూమి నాలుగువైపుల ఎత్తైన గోడలు ఉండేవని స్కంద పురాణమ్ లో వివరించారు.
వాదనలు వినిపిస్తూ పండిత్ తులసీ పీఠాధీశ్వర్ జగద్గురు రామభద్రాచార్య రుగ్వేద జైమినీయ సంహితను, సరయూ నదీ దగ్గర ఉన్న కొన్ని గ్రంధాలను ఉటంకరిస్తూ రామజన్మభూమి సాక్ష్యాలను వివరించారు. అప్పుడు ప్రపంచానికి ఆయన గొప్పదనం తెలిసింది. 2007 నవంబర్ నెలలో అల్ ఖైదా సభ్యులు రామభద్రాచార్య వెంటనే ఇస్లామ్ లో మార్చుకోవాలనీ లేకపోతే చంపేస్తానని బెదరించారు.
Also read: నడిచే సంప్రదాయ విజ్ఞాన సర్వస్వం -న.చ. రఘునాథాచార్యులు
మాడభూషి శ్రీధర్ 21.6.2023