- మిసిమి పత్రిక సంపాదకుడిగా ఖ్యాతి గడించిన అన్నపరెడ్డి
- విచారం వ్యక్తం చేస్తున్న సాహితీ ప్రియులు
ప్రముఖ సాహితీ వేత్త మిసిమి పత్రిక సంపాదకులు అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు (మార్చి 9) తుదిశ్వాస విడిచారు. అన్నపరెడ్డి అధ్యాపకుడిగా పనిచేస్తూనే సాహిత్యంలో విశేష కృషి చేశారు. ప్రముఖ మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ మనస్తత్వ శాస్త్రాన్ని తెలుగులోకి అనువదించారు. ఆయన మృతిపట్ల రచయితలు, సాహితీ ప్రియులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Also Read : `ఈలపాట` మధురిమల మూట
అన్నపరెడ్డి సంపాదకులుగా పనిచేసిన మిసిమి తెలుగు మాస పత్రికలో తెలుగు సాహిత్యం, సంస్కృతి పరమైన వ్యాసాలు, తెలుగు కవితలతో పాటు ఎందరో స్ఫూర్తి ప్రదాతలైన వ్యక్తుల జీవన విధానాన్ని పాఠకులకు తెలియజేసేవారు. అన్నపరెడ్డి 1933 ఫిబ్రవరి 22న జన్మించారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరు. హైదరాబాద్ మదీనాగూడలో రేపు అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.
Also Read : నట `మిక్కిలి`నేని