కేన్సర్ రోగులపైన జరుగుతున్న ప్రయోగాలలో ఇటీవల వెల్లడైన ఒక ఫలితం వైద్యులనూ, ప్రవీణులనూ సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ప్యుబిటీ అనే కొత్త మందు కొలొరెక్టల్ కేన్సర్ పైన ప్రయోగించారు. నూటికి నూరు పాళ్ళు జయప్రదంగా ఆ మందు పని చేయడం విశేషం.
మానవ శరీరంలో యాంటీబాడీలకు బదులుగా పని చేసే డాస్టర్లిమాబ్ ను కనిపెట్టారు. ప్రయోగశాలలో తయారు చేసిన మాలిక్యూల్స్ తో డాస్టర్లిమాట్ ను ఉత్పత్తి చేశారు. ఈ మందును 18మీద ఉపయోగించిన ఏడాది అనంతరం వెల్లడైన ఫలితాలను చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. డాక్టర్లు అన్ని వైద్య పరీక్షలు చేశారు. ఎండోస్కోపీ చేశారు. పెట్ స్కాన్ చేశారు. ఎంఆర్ఐ స్కాన్ చేశారు. కేన్సర్ ఆచూకీ రవ్వంత కూడా వారికి కనిపించలేదు.
‘‘కేన్సర్ చరిత్రలో ఇటువంటి ఫలితాలు రావడం ఇదే ప్రథమం,’’అని న్యూయార్క్ మెమోరియల్ స్లోన్ కెట్టరింగ్ కేన్సర్ సెంటర్ కు చెందిన డాక్టర్ లూయీస్ ఏ. డయాజ్ జూనియర్ అన్నారు. భవిష్యత్తులో కేన్సర్ ను జయించే మందు తయారవుతుందేమో చూడాలి.