Friday, December 27, 2024

ప్రాణదాత డాక్టర్ చంద్రకాంత్

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్న సమయంలో ‘నేనున్నాను’ అని ధైర్యంచెప్పి వారి ప్రాణాలను కాపాడి నిలపడానికి ‘హెర్బల్ అండ్ బయోమాలిక్యులర్ రెమిడీస్’ అనే మందును (కిట్) ఎంతో మందికి ఉచితంగా అందజేశారు డాక్టర్ చంద్రకాంత్. ఆయన ఆస్పత్రి లక్డీకాపుల్ లోని మహావీర్ ఆస్పత్రి ప్రాంగణంలో ఉంది.  మందును వేలాది ప్రజలకు అందించేందుకు వారు ఎంతో శ్రమించారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఏ సమయంలో ఫోన్ చేసినా వెంటనే స్పందించి అవతలి వాళ్లకు ఎలాగైనా మందును పంపించాలని ఎంతో తపనపడి వాటిని వారికి అందే విధంగా ఏర్పాటు చేశారు. కరోనా వచ్చిందని చెప్పగానే ముందుగా ఆయన ఎంతో ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని ఇచ్చిన తరువాతనే వారు ఇచ్చే మందు గురించి ఎలా వాడాలో చెప్పేవారు. ముందు వారు ఇచ్చే మానసిక ధైర్యంతోనే సగం కరోనా వైరస్ చచ్చిపోతుంది. ‘మీకు ఏమీ కాదు, మీకు నేను ఉన్నాను, ధైర్యంగా ఉండండి, ఇంట్లోనే ఉండండి’ అంటూ ఎంతో మానసిక స్థైర్యాన్నిచ్చారు.

ఏప్రిల్ 14న నాకు, మా ఆవిడ, మా ఇద్దరి పిల్లలకు కరోనా సోకింది. 16వ తేదీన డాక్టర్ చంద్రకాంత్ కి ఫోన్ చేసి విషయం చెప్పాను. అదే రోజు అర్ధరాత్రి 12 గంటలకు మాకు ‘మిరకిల్ మందు’ను పంపించారు. మా ఆవిడకి, మ అబ్బాయికి దగ్గు బాగా ఉంది. వారు పంపించిన ‘మందులో విన్నర్’ (లిక్విడ్ బాటిల్) ను వెంటనే తాగించాను. అది తాగిన అరగంటకు దగ్గు పూర్తిగా తగ్గిపోయింది. నాకు జర్వం తక్కువగా ఉన్నప్పటికీ మా ఆవిడకు, మా ఇద్దరు అబ్బాయిలకు 101, 102 డిగ్రీల జర్వంతోపాటు ఒళ్ళు నొప్పులు, జలుబు, వాసన, రుచి కోల్పోవడం వంటివి ఉన్నాయి. ఇవి వాడిన అయిదు రోజులకు నార్మల్ రావడం నాకు చాలా ఆశ్చర్యాన్నిచ్చింది. నాకు తెలిసిన వాళ్ళలో 12 నుంచి 14 రోజుల వరకు జ్వరం ఉంటూనే ఉన్నది. ఇదే విషయం వాళ్ళకు చెబితే అదేలా సాధ్యమని అన్నారు. ఇవి వాడిన తరువాత మంచి ఆకలి ఉండేది, దానితోపాటు మంచి నిద్ర కూడా పట్టేది. ఎలాంటి నీరసం లేకుండా ఎంతో హాయిగా ఉన్నాము. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మా అందరిలో లేవు. నీరసం,  కోర్సు పూర్తిగా అయిన 5 రోజుల తరువాత మరోసారి టెస్ట్ చేయించుకున్నాము. అందరికీ నెగిటివ్ వచ్చింది. టెస్ట్ చేసిన డాక్టరే చాలా ఆశ్చర్యపోయారు. ఇదేలా సాధ్యమని. నాకు నిజంగానే ఇది ‘మిరకిల్ మందు’ అని అనిపించింది.  మందు పంపించగానే నా పని అయిపోయిందని డాక్టర్ చంద్రకాంత్ కాంత్  అనుకోలేదు. మందులు ఎలా పనిచేస్తున్నాయని ప్రతి రెండు రోజులకు ఒకసారి ఫోన్ చేసి మరీ యోగక్షేమాలు తెలుసుకునేవారు. సేవ చాలామంది చేస్తారు. కానీ చంద్రకాంత్ గారు చేసిన సేవ నిజంగానే అసమానం. ఈ కరోనా సమయంలో ఎంతో మందిని తన మందులతో నయం చేసిన ఘనత డాక్టర్ చంద్రకాంత్ గారిదే. గొప్ప మనస్సు గల చంద్రకాంత్ గారికి శతసహస్ర వందనాలు.

డాక్టర్ చంద్రకాంత్ గారికి, వారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ….

కృతజ్ఞతాభివందనాలతో……

మీ శ్రేయోభిలాషి

కె.వి.ఎన్.ఎల్.నరసింహారావు (నాగరాజు),

జర్నలిస్టు

Related Articles

1 COMMENT

  1. ప్రేమకు రూపం మా సార్, మా లాంటి వారికి దేవుడు మా boss

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles