సమ్మక్క-సారలమ్మ జాతరలో పాల్గొన్నా మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.కెసీఆర్ ప్రధాని అయితే యువతకు ఉద్యోగాలొస్తాయన్నారు. ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రధాని కావాలని మొక్కుకున్నట్లు తెలిపారు. గతంలో తాను కోరిన కోరికలను అమ్మవార్లు తీర్చారని గుర్తు చేశారు.పది సంవత్సరాల నుంచి తాను ఏది కోరుకున్నా అది విజయవంతం అయిందన్నారు. ఇప్పుడు ఒక్కటే ఒక కోరిక కోరానని..ఒక్క సారి సీఎం కెసీఆర్ ప్రధానిని చేస్తే భారత దేశం అంతా సస్యశ్యామలం అవుతుందని,యువతకు మంచి ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో..భారతదేశం అంతా కూడా రెండు సంవత్సరాల్లోనే చేసి చూపిస్తారన్నారు. తప్పకుండా వనదేవతలు తన మొక్కులు తీరుస్తారన్నారన్నారు. తనకు మెడికల్ కాలేజీ కావాలనుకున్నానాని అప్పుడు నాకు వనదేవతలు ఇచ్చారు. ఎంపీ కావాలనుకున్నా ఎంపీ అయ్యాను. మినిస్టర్ కావాలనుకున్నా..మినిస్టర్ అయ్యా. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మా కెసీఆర్ కావాలని మొక్కినా..తప్పుకుండా అయితరన్నారు మంత్రి మల్లారెడ్డి