నేడు క్రిస్ మస్ ప్రపంచ దేశాల్లో ఒక ఆరాధనగా క్రీస్తును స్మరించుకుంటూ కీర్తనలు పాడుకునే సందర్భంగా క్రీస్తు పూర్వం – క్రీస్తు శకం పదాలు ఎక్కువగా వినిపిస్తాయి. క్రీస్తు పుట్టిన తరువాత పూర్వం కాలగమనాన్ని నిర్ధారించారు…అయితే భూమి ఎప్పుడూ పుట్టిందో ఎవరికి అంతు పట్టని విషయం! కొన్ని ప్రమాణాలు ఉన్నా నిర్ధారించడానికి కావాల్సిన ఆధారాలు లేకపోవడం వల్ల ఈ సంవత్సరాల కొలతలు నిర్ధారణ కావడానికి ప్రపంచం ఎంచుకున్న విధానం క్రీస్తుపూర్వం – క్రీస్తు శకం!!
పంచాంగాలలో కాని కేలండర్లో కాని కాల గమనాన్ని కొలవడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. చరిత్రలో “ఏయే సంఘటనలు ఎప్పుడు జరిగాయి?” అనే ప్రశ్న వచ్చినప్పుడు ఒక నిర్ధిష్టమైన సంఘటనని ప్రమాణంగా తీసుకుని అక్కడ నుండి కాలగమనాన్ని లెక్క పెట్టవచ్చు. ఈ పద్ధతి ప్రకారం భారతదేశంలో శాతవాహన శకం లేదా శాలివాహన శకం వాడుకలోకి వచ్చేయి. ఇదే విధంగా వివిధ ప్రాంతాలలో వివిధ పద్ధతులు వెలిసేయి. పాశ్చాత్య దేశాలలో క్రైస్తవ మతం ప్రబలంగా ఉండబట్టి ఆయా సమాజాలలో ఏసు క్రీస్తు పుట్టిన సమయం నుండి క్రీస్తు శకం అని లెక్క పెట్టడం మొదలు పెట్టారు. క్రీస్తు పుట్టక మునుపు జరిగిన సంఘటనలని క్రీస్తు పూర్వం అని వెనక్కి లెక్కపెట్టడం మొదలు పెట్టేరు. దీనిని ఆంగ్లంలో Before Christ అంటారు. ఆంగ్లంలో BC లేదా B.C. అని రాయడం లేదా పిలవడం జరుగుతుంది. తెలుగులో క్రీ.పూ లేక క్రీస్తు పూర్వం అని వాడడం జరుగుతుంది. క్రీస్తు పుట్టిన తరువాత కాలాన్ని ఇంగ్లీషులో AD అని కాని A.D. అని కాని రాస్తారు; అంటే లేటిన్ భాషలో “Anno Domini” లేదా ఇంగ్లీషులో “”In the year of the Lord.” మనం శాలివాహనుడి నుండి లెక్క పెడితే వారు కీస్తు నుండి లెక్క పెడతారు
శాలివాహన శకం
మానవజాతి చరిత్రలో కాలమానాలను చరిత్ర ప్రసిద్ధులైన వారి పేరుతో వాడుట పరిపాటి అయింది. వీటిలో ప్రముఖంగా వాడబడుతున్న క్రీస్తు శకం ఒకటిగాక, భారతదేశంలో ప్రామాణికమైనది శాలివాహనశకం. ఇది హిందూ కాలమానం, భారతజాతీయ కాలమానం, కంబోడియా బౌద్ధ కాలమానంగా వాడబడుతున్నది. ఇది శాతవాహనులలో ప్రముఖుడైన హాలశాతవాహనుని రాజ్యకాలం లో శకనులపై విజయం సాధించిన సంవత్సరం నుండి ప్రారంభమైనది. ఇది క్రీ.శ 78 లో ప్రారంభమైంది. దీనికి ముందు విక్రమశకం క్రీ పూ 56 నుండి వాడుకలో ఉండేది! మనుషులు కాలాన్ని లెక్క పెట్టడం మొదలుపెట్టిన తరువాత కేలండర్ తయారు చేసుకుని సంవత్సరాలు లెక్కించడం మొదలుపెట్టారు. ప్రతి నాగరికతా సంస్కృతీ తనదైన పద్ధతిలో కాలాన్ని లెక్కపెట్టేది. కాలాన్ని శకాలు, యుగాలు, సంవత్సరాలు, నెలలు, పక్షాలు.. ఇలా విభజించుకున్నారు. లెక్కించే విధానాన్ని బట్టి ఆయా కాలాల్లో అందుబాటులో ఉన్న పరిజ్ఞానాన్ని బట్టి అది సాగింది.సంవత్సరానికి సరిగ్గా 365 రోజులు కాకుండా ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. ఆ సమస్యను పరిష్కరించడానికి లీపు సంవత్సరాలు, అధిక మాసాలు వచ్చాయి. ఇదంతా కేలండర్ సంగతి. మరి అసలు ఇది ఎన్నో సంవత్సరం? ఈ సంవత్సరాల లెక్క మొదలైంది క్రీస్తు పుట్టుకతోటేనా?ఎవరి సంస్కృతికి తగ్గట్టు వారు శకాన్ని లెక్కపెట్టడం మొదలుపెట్టారు. దానికి అనుగుణంగా వారి కేలండర్‌లో నెలలు ఉంటాయి. అలా జీసస్
క్రీస్తు పుట్టిన ఏడాది నుంచి లెక్కబెడితే క్రీస్తు శకం అయింది. అంటే ఇంగ్లీష్ కేలండర్ ప్రకారం ఇప్పుడు మనం క్రీస్తు శకం 2020 లో ఉన్నాం. ఆంధ్రలోని అమరావతి కేంద్రంగా పాలించిన గౌతమీ పుత్ర శాతకర్ణి పట్టాభిషిక్తుడైన నాటి నుంచీ శాలివాహన శకం ప్రారంభం అయింది. అలా ఇప్పటికి 1940 ఏళ్లు గడిచి 1941 లోకి అడుగుపెడుతున్నాం. తెలుగు, కన్నడ, మరాఠీ ప్రజలు ఈ కేలండర్ వాడతారు.
ఇక ఉత్తర భారతీయులు విక్రమాదిత్యుడు అనే రాజు పట్టాభిషిక్తుడైన నాటి నుంచి సంవత్సరాలు లెక్కపెడుతున్నారు. అలా ఇప్పటికి 2075 ఏళ్లు గడిచి 2076లోకి అడుగుపెడుతున్నాం. ఇంగ్లిష్ కేలండర్ డిసెంబర్ 31న మారినట్టుగా ఈ శాలివాహన, విక్రమ శకాలు ఉగాది రోజున మారతాయి. అంటే ఇది తెలుగు వారికి 1941వ సంత్సరం కాగా.. ఉత్తరాది వారికి 2076వ సంవత్సరం అన్నమాట. ఈ శాలివాహన శకం, క్రీస్తు శకం కంటే 79 సంవత్సరాలు ఆలస్యం. విక్రమాదిత్య శకం, క్రీస్తు శకం కంటే 58 సంవత్సరాలు ముందు ఉంది.
ఈ నంబర్లతో పాటూ సంవత్సరాలను గుర్తు పెట్టకోవడానికి ప్రతి ఏడాదికీ ఒక్కొక్క పేరు చొప్పున 60 పేర్లు ఎంపిక చేసి వాటిని రొటేషన్‌లో వాడతున్నారు. అవే ఈ హేవళంబి, విళంబి వంటి పేర్లు. దాదాపుగా ప్రపంచం మొత్తం వాడే కాలెండరు గ్రెగోరియన్ కేలండరు. నేపుల్సుకు చెందిన అలోయిసియస్ లిలియస్ అనే వైద్యుడు జూలియన్ కాలెండరుకు చేసిన సవరణల ఫలితమే ఈ కాలెండరు. దీన్ని పోప్ గ్రెగొరీ XIII తయారుచేయించి 1582 ఫిబ్రవరి 24 న అమలుపరచాడు. ఆయన పేరు మీదుగా దీనికి గ్రెగోరియన్ కాలెండరు అనే పేరు వచ్చింది.నేడు ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించే క్యాలెండర్ ఇది. దశాబ్దాలుగా, ఇది అనధికారిక ప్రపంచ ప్రమాణం, ఇది అంతర్జాతీయ కమ్యూనికేషన్, రవాణా మరియు వాణిజ్య సమైక్యత యొక్క ఆచరణాత్మక ప్రయోజనాలలో స్వీకరించబడింది మరియు ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలచే గుర్తించబడింది.
సంక్షిప్తీకరణ విస్తృతంగా ఉపయోగించబడింది. వలస యుగంలో పాశ్చాత్య ప్రభావం ప్రపంచ వ్యాప్తం అవడంతో వారి పద్ధతులు మనం అంతా అవలంబించక తప్ప లేదు. ఇప్పుడు కాలం మారింది. ప్రపంచీకరణ ద్వారా భూగోళం కుచించుకు పోతూంది. వార్తా ప్రచార సాధనాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంలో “క్రైస్తవుల పద్ధతే ఎందుకు అవలంబించాలి?” అనే ప్రశ్న ఉదయించడం సహజం. అందుకని ఇరవయ్యవ శతాబ్దపు చివరి రోజులలో కాల గమనాన్ని లెక్కించే పద్ధతి సర్వులకి ఆమోదయోగ్యంగా ఉంటే బాగుంటుందనిపించి చిన్న మార్పు తీసుకు వచ్చారు. క్రీస్తు శకం (Anno Domini or AD) అని అనడానికి బదులు CE (common Era, సాధారణ శకం) అని ప్రతిపాదించేరు. అదే విధంగా BC ని BCE (Before Common Era) మార్చమన్నారు. ఈ ప్రతిపాదనని క్రైస్తవులు తేలికగా అంగీకరించడానికి కారణం CE అంటే Chritian Era అని అనుకోడానికి అవకాశం ఉంది కదా.
ఇదీ చదవండి: ధర్మపురిలో వెల్లివిరుస్తున్న మతసామరస్యం