Sunday, December 22, 2024

మెగాస్టార్ కు కోవిద్ పోజిటీవ్

త్వరగా కోలుకోవాలంటూ మహేష్, జూ. ఎన్టీఆర్, రవితేజ తదితరుల ట్వీట్లు

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవికి కోవిద్ పాజిటీవ్ తేలింది. కోవిద్ కారణంగా నిలిచిపోయిన ‘ఆచార్య’ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించే ముందు నిబంధనల ప్రకారం కోవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటీవ్ గా వచ్చిందనీ, తనను నాలుగైదు రోజులుగా కలుసుకున్నవారందరూ కోవిద్ టెస్ట్ చేయించుకోవాలని ఒక ట్వీట్ లో చిరంజీవి తెలియజేశారు. చిరంజీవి క్వారెంటైన్ లోకి వెళ్ళిపోయారు.

megastar chiranjeevi tests corona positive

చిరంజీవి, నాగార్జున శుక్రవారంనాడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ని కలుసుకున్నారు. కేసీఆర్, నాగార్జున సైతం కోవిద్ టెస్ట్ చేయించుకోవాలి. వీరు కలుసుకున్నప్పుడు ముగ్గురు కూడా మాస్క్ ధరించలేదు. మాక్స్ ధరించకపోతే ప్రజలకు జరిమానా విధించే రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. జరిమానా విధించే రాష్ట్ర ముఖ్యమంత్రి, కోవిద్ కారణంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అభిమానులకూ, ప్రజలకూ సందేశాలు ఇచ్చే టాప్ హీరోలు చిరంజీవి, నాగార్జున వంటి వారు మాస్క్ లేకుండా కలుసుకోవడం, చెక్కులు ఇవ్వడం, పుచ్చుకోవడం ఎటువంటి సందేశం ఇస్తుంది?

చిరంజీవి ట్వీట్ కు స్పందించిన హీరోలు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుతూ, ‘గెట్ వెల్ సూన్ ’ అంటూ ట్వీట్ ఇచ్చారు. మహేష్ బాబు విమానంలో ప్రయాణం చేస్తూ కొత్త పరిస్థితికి అలవాటుపడిపోతున్నామనీ, సురక్షితమైన విమానప్రయాణానికి సిద్ధమైనామనీ, జీవితం మళ్ళీ గాడిలో పడిందనీ ట్వీట్ చేశారు (Getting used to the new normal!  All equipped for a safe flight. Life’s back on track. Jet set go!).

megastar chiranjeevi tests corona positive

చిరంజీవి త్వరగా కోలుకోవాలని మరోహీరో రవితేజ ట్వీట్ ఇచ్చారు. కొణిదల వరుణ్ తేజ కూడా చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ ఇచ్చారు. త్వరగా కోలుకోండి సర్. గట్టిగా ఉండండి(Get well soon sir. Stay strong)’ అని నితిన్ ట్వీట్ ఇచ్చారు. కొరటాల శివ, అనిల్ రావిపూడి, బండ్ల గణేశ్, దేవిశ్రీప్రసాద్, బీఏ రాజు, సుధీర్ బాబు, తదితర సినీ ప్రముఖులు కూడా చిరంజీవి త్వరగా కోలుకోవాలంటూ శుభాకాంక్షలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles