ఏదైనా…
ఏమైనా…
ఎంతమాత్రమైనా…
నా తెలుగు జాతికి వ్యతిరేకమైనదీ…
నా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టేదీ…
నా ప్రాంతానికి…
నా ప్రజలకు…
నా దేశానికి…
నా సమాజానికి…
అన్యాయం చేసేదీ…
నాకు ‘అధర్మం’ అనిపించిందీ…
నా దేశ ఐక్యతనూ…
నా దేశ సమైక్యతనూ…
నా దేశ సార్వభౌమత్వాన్నీ…
ఇబ్బందిపెట్టేదీ…
దెబ్బతీసేదీ…
అని…
నేను భావిస్తే…
నేను నమ్మితే…
నేను విశ్వసిస్తే…
“నేను స్పందిస్తాను”…
నేను ‘నా’ అసమ్మతిని…
చాలా ‘బలంగా’ ప్రకటిస్తాను…
‘నా’ నిరసనను…
నేను చాలా ‘ధైర్యంగా’ వ్యక్తపరుస్తాను…
నేను ‘ఎవరికీ’ ఎంతమాత్రమూ భయపడను…
నా ‘ప్రాణం’ పోయినా సరే…
భారత ప్రజాస్వామ్యంలో…
ప్రతి ఒక్కరికీ…
దేన్నైనా వ్యతిరేకించే హక్కు…
ఎవర్నైనా ప్రశ్నించే హక్కు…
తప్పుచేసినవారు ‘ఎవరైనా’…
ఎంతవారైనా…
ఎంత’పెద్ద’వారైనా…
ధైర్యంగా…
ఎదిరించే హక్కు…
ఉందని…
ఉంటుందని…
నేను భావిస్తున్నాను…
నేను నమ్ముతున్నాను…
నేను చాలా ‘బలంగా’ విశ్వసిస్తున్నాను…
అది ‘నాకు’ నా పవిత్ర దేశం…
మన పవిత్ర ‘భారత’ రాజ్యాంగం…
నాకు కల్పించిన “హక్కు” అనీ…
నా ‘ప్రాథమిక’ హక్కు అనీ…
అదే నా ”స్వేచ్ఛ’ అనీ…
అదే నా ‘స్వాతంత్రం’ అనీ…
అని నేను భావిస్తున్నాను…
నిజంగా నమ్ముతున్నాను…
ఎంతగానో విశ్వసిస్తున్నాను…
ఇది నిజం కాని ప్రతి రోజూ…
ఇది నిజం కాని ప్రతి క్షణమూ…
నేను నిజంగా ‘జీవన్మృతుడనే’…
జై హింద్… భారతమాతకు జై…
Also Read: నేను “మనిషి”ని…