- లిటిల్ మాస్టర్ 50 ఏళ్ల క్రికెట్ జీవితం
- వాంఖెడీ స్టేడియంలో సన్నీకి సొంత బాక్స్
భారత క్రికెట్ తొలి లిటిల్ మాస్టర్, ఆల్ టైమ్ గ్రేట్ ఓపెనర్ సునీల్ గవాస్కర్ కు ముంబై క్రికెట్ సంఘం ఓ అరుదైన కానుక ఇవ్వనుంది. క్రికెట్ చరిత్రలోనే 10వేల పరుగుల మైలురాయి చేరిన తొలి టెస్టు ఓపెనర్ గా చరిత్ర సృష్టించిన సునీల్ మనోహర్ గవాస్కర్ క్రికెటర్ గా, క్రికెట్ వ్యాఖ్యాతగా యాభైసంవత్సరాల కెరియర్ ను పూర్తి చేశారు.
Also Read : 2020-21 రంజీ సీజన్ హుష్ కాకి
1971లో కరీబియన్ గడ్డపై వెస్టిండీస్ ప్రత్యర్థిగా 20 సంవత్సరాల వయసులో టెస్టు అరంగేట్రం చేసిన గవాస్కర్ ఆ తర్వాత అంతైఇంతై అన్నట్లుగా ఎదిగిపోయారు.
1970 దశకంలో భారత క్రికెట్ తొలి సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన 71 సంవత్సరాల గవాస్కర్ కు ముంబై క్రికెట్ సంఘం..వాంఖెడీ స్టేడియంలో ఫిబ్రవరి 9న జరిగే ఓ కార్యక్రమంలో ఓ సొంత బాక్స్ ను కానుకగా అందచేయనుంది.
Also Read : దేశవాళీ టీ-20 లో టైటిల్ సమరం
1971 మార్చి 6న పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా తొలిటెస్టుమ్యాచ్ ఆడిన గవాస్కర్ తొలిఇన్నింగ్స్ లో 65, రెండో ఇన్నింగ్స్ లో 67 నాటౌట్ స్కోర్లు సాధించారు. అంతేకాదు..సిరీస్ మొత్తంలో 774 పరుగులతో 154.80 సగటు సాధించి రికార్డుల మోత మోగించారు.
ముంబై, భారత క్రికెట్ కే గర్వకారణంగా నిలిచిన దిగ్గజం సునీల్ గవాస్కర్ రిటైర్మెంట్ తర్వాత చక్కటి క్రికెట్ వ్యాఖ్యాతగా స్థిరపడిపోయారు.
Also Read : బీసీసీఐ కార్యదర్శికి అరుదైన గౌరవం