- ముంబయిలో చోటుచేసుకున్న ఘటన
- 10 మంది మృతి
- ఆసుపత్రి నిర్వహణపై విమర్శల వెల్లువ
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో దారుణం జరిగింది. భాండప్ ప్రాంతంలో ఓ మాల్ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం అర్థరాత్రి డ్రీమ్స్ మాల్ లోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలో మూడో అంతస్తులో ఉన్న ఆసుపత్రికి మంటలు వ్యాపించాయి. ఈ ఆసుపత్రిలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. పదుల సంఖ్యలో పేషెంట్లు ఆస్పత్రిలో చిక్కుకున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్, అగ్ని మాపక సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. 20కి పైగా ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.
మృతులసంఖ్యపై గందరగోళం:
ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. అయితే ఆసుపత్రి వర్గాలు మాత్రం ఇద్దరు కొవిడి పేషెంట్లు అప్పటికే చనిపోయారని ఘటనలో మృతిచెందిన వారు కొవిడ్ పేషెంట్లు కాదని తెలిపారు. 76 మంది రోగులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని చెబుతున్నారు. అగ్ని ప్రమాదం ఉద్దవ్ ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ఈ ఘటన రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. అసలు మాల్ ఉన్న భవంతిలో ఆసుపత్రి నడిపేందుకు ఎలా అనుమతులిచ్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: కశ్మీర్ లో తులిప్ పూల సందడి
ఆసుపత్రికి అనుమతులెలా ఇచ్చారు:
ఆసుపత్రి వర్గాలు మాత్రం నిబంధనల ప్రకారమే ఆసుపత్రి ఏర్పాటు చేశామని చెబుతున్నారు. అగ్ని ప్రమాదానిక గల కారణాలు ఇంకా తెలియరాలేదని డీసీపీ తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.