- టీ-20ల్లో కివీ ఓపెనర్ సరికొత్త రికార్డు
- కంగారూలపై కదం తొక్కిన మార్టిన్
న్యూజిలాండ్ డాషింగ్ ఓపెనర్, వీరబాదుడులో మొనగాడు మార్టిన్ గప్టిల్ ..టీ-20 ఓ మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకూ భారత ఓపెనర్ రోహిత్ శర్మ పేరుతో ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును గప్టిల్ తెరమరుగు చేశాడు. డునేడిన్ వేదికగా ఆస్ట్ర్రేలియాతో జరిగిన 2021 సిరీస్ లోని టీ-20 మ్యాచ్ లో గప్టిల్ చెలరేగిపోయాడు. పూనకం వచ్చినట్లు ఎడాపెడా షాట్లు కొడుతూ ఆస్ట్ర్రేలియా బౌలర్లను కంగారెత్తించాడు.
8 సిక్సర్లతో ధూమ్ ధామ్ బ్యాటింగ్
Also Read: దేశవాళీ క్రికెట్లో సరికొత్త రికార్డు
గత కొంతకాలంగా అంతంత మాత్రంగా ఆడుతున్న గప్టిల్… కేవలం 50 బంతుల్లోనే 97 పరుగుల స్కోరు సాధించాడు. 8 సిక్స్‌లు, 6 బౌండరీలతో సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచాడు. ఈ ఎనిమిది సిక్సర్లతో టీ-20 చరిత్రలోనే ఓ అంతర్జాతీయ ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఓ మ్యాచ్ లో బాదిన ఆరు సిక్సర్లే ఇప్పటి వరకూ అత్యధిక సిక్సర్ల ప్రపంచ రికార్డుగా ఉంది.
96 మ్యాచ్ ల్లో 132 సిక్సర్లు
Also Read: రూట్ స్పిన్ లో భారత్ గల్లంతు
డునేడిన్ లో ముగిసిన ప్రస్తుత మ్యాచ్ వరకూ 96 టీ-20లు ఆడిన గప్టిల్ ఇప్పటి వరకు 132 సిక్స్ లు బాదాడు. భారత ఓపెనర్ రోహిత్ శర్మ 108 మ్యాచ్ లలో 113 సిక్సర్లు సాధించాడు. రోహిత్ శర్మ పేరుతో ఉన్న అత్యధిక టీ-20 సిక్సర్ల రికార్డును గప్టిల్ తెరమరుగు చేయగలిగాడు. న్యూజిలాండ్ ఆటగాడు కొలిన్ మన్రో (107), కరీబియన్ సునామీ ఓపెనర్ క్రిస్ గేల్ (105) ఆ తర్వాతి స్థానాలలో ఉన్నారు. క్రిస్ గేల్ కేవలం 58 మ్యాచ్‌ల్లోనే105 సిక్సర్లు బాదడం ప్రపంచ రికార్డుగా మిగిలిపోతుంది. గప్టిల్ వీరబాదుడు జోరుతో ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5 పరుగులతో విజేతగా నిలిచింది. ముందు బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్.. గప్టిల్ మెరుపు బ్యాటింగ్ తో 20 ఓవర్లలో 219 పరుగులు స్కోరు సాధించగలిగింది. 220 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన ఆస్ట్రేలియా విజయానికి చేరువగా వచ్చినా 5 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 2 -0 తో పైచేయి సాధించినట్లయ్యింది.